|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun: గద్దర్ అవార్డులు.. తెలంగాణ ప్రభుత్వంపై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు

Published: 29-05-2025, 7:31 AM
Allu Arjun: గద్దర్ అవార్డులు.. తెలంగాణ ప్రభుత్వంపై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, పుష్ప-2 సినిమాకు ఈ అవార్డును అంకితం చేశారు. ఈ అవార్డులపై టాలీవుడ్ ప్రముఖులు తమ స్పందనలు తెలియజేశారు.

Key Points

1

అల్లు అర్జున్ గద్దర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎంపిక

2

పుష్ప-2 సినిమాకు గుర్తింపుగా అవార్డును అంకితం చేశారు

4

జూనియర్ ఎన్టీఆర్, వైజయంతీ మూవీస్ కూడా అవార్డులపై స్పందించారు

అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Awards) జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. ఇందులో వివిధ విభాగాలకు గాన మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహితల పేర్లను అనౌన్స్ చేశారు. ఈ అవార్డుల నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ఉత్తమ నటుడు కేటగిరిలో పుష్ప-2 సినిమాకు (Pushpa -2) గాను అల్లు అర్జున్ పేరును అనౌన్స్ చేసింది. ఈ అవార్డుపై తాజాగా అల్లుఅర్జున్ (Allu Arjun) స్పందించారు. ఉత్తమ్ నటుడిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నానని తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ఘటన అంతా సుకుమార్, నిర్మాతలు, పుష్ప బృందానిదేనన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును అభిమానులకు అంకితం ఇస్తున్నానని మీ తిరుగులేని మద్దతు నాకు స్ఫూర్తిని ఇస్తూనే ఉందని ఎక్స్ వేదికగా అల్లుఅర్జున్ పోస్టు చేశారు.

ఇక దేవర మూవీకి గాను గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కిన నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలందరికీ అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి ఈ చొరవ తీసుకోవడం నిజంగా హృదయపూర్వకంగా ఉందని ట్వీట్ చేశారు. ఉత్తమ చిత్రం కేటగిరిలో ‘కల్కి’కి అవార్డు దక్కినందుకు వైజయంతీ మూవీస్ కృతజ్ఞతలు తెలిపింది. మా ప్రయాణాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.

గద్దర్ అవార్డులు – విజేతలు

టాలీవుడ్ ప్రముఖుల స్పందనలు

తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డులకు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ తన అవార్డును అభిమానులకు అంకితం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.