|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిక్కులేని పావలా శ్యామలకు దేవుడైన అల్లు అర్జున్! ప్రతి నెల ఆర్ధిక సాయం!

Published: 04-03-2026, 4:35 AM
దిక్కులేని పావలా శ్యామలకు దేవుడైన అల్లు అర్జున్! ప్రతి నెల ఆర్ధిక సాయం!
  • నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం
  • ప్రతినెలా రూ.10,000 ఆర్థిక సాయం అందించనున్న అల్లు అర్జున్
  • ఆర్థిక ఇబ్బందుల్లో నటి పావలా శ్యామల
  • సికింద్రాబాద్ ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న శ్యామల

సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆమెకు అండగా నిలిచారు. ప్రతి నెల రూ.10,000 ఆర్థిక సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె సికింద్రాబాద్ లోని ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నారు.

పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి

Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పావలా శ్యామల ఒకరు. స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీగా సంపాదించినప్పటికీ ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. తన కుమార్తె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈమె సంపాదించింది మొత్తం కూతురు చికిత్స కోసమే ఖర్చు చేయడంతో నేడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందారు.

పావలా శ్యామలతో పాటు తన కుమార్తె కూడా ఇదే ఆశ్రమంలో ఉన్నారు అయితే వీరి ఆనారోగ్య సమస్యల కారణంగా ప్రతి నెల మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈమె ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు తరచూ ఈమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. తాజాగా పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న నటుడు అల్లు అర్జున్ ఈమెకు అండగా నిలిచారు. పావలా శ్యామల తన కుమార్తె పరిస్థితిని తెలుసుకున్న ఈయన వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పావలా శ్యామలతో పాటు తన కుమార్తె నిత్యావసరాలు అలాగే మందుల కోసం ప్రతినెల పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందేలా అల్లు అర్జున్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.

అల్లు అర్జున్ సహాయం

ఇలా ఆర్థికంగా ఒకేసారి ఆమెకు సహాయం చేయకుండా ప్రతినెల తన అవసరాలు మందుల నిమిత్తం 10000 రూపాయలు అందించడానికి బన్నీ నిర్ణయం తీసుకోవడంతో బన్నీ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఈమెకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే . నటిగా పావలా శ్యామల ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే ఈమె కూతురికి మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలలో నటించింది మొత్తం తన కుమార్తె వైద్య చికిత్స కోసం ఖర్చు చేశారు.

ఆత్మహత్యకు పాల్పడిన పావలా శ్యామల..

ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం

ఇప్పుడు శ్యామల వయసు పై పడటంతో గత కొంతకాలంగా ఈమెకు సినిమా అవకాశాలు లేవు దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉండటానికి కూడా సొంత ఇల్లు లేకపోవడంతో ఈమె పలు ఆశ్రమాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలను తట్టుకోలేక శ్యామల ఇటీవల ఆత్మహత్యకు కూడా పాల్పడిన సంగతి తెలిసిందే .ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన పావలా శ్యామలను ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్ లో ఉంచి ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఇక ఈమె పరిస్థితి తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తనకు సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు.

పావలా శ్యామల కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.