
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
Key Points
అల్లు అర్జున్ 22వ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు.
దీపిక పదుకునేతో పాటు జాన్వి కపూర్, మృనాల్, రష్మిక మందాన, భాగ్యశ్రీ కూడా నటించే అవకాశం ఉంది.
నలుగురు హీరోయిన్లు సినిమా సెకండ్ హాఫ్‌లో కనిపిస్తారని అంటున్నారు.
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా
టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప (Pushpa 2) సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమా రెండు పార్టులు బంపర్ హిట్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతోంది. అంతేకాదు జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతనే.. అవార్డు అందుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు.. హాలీవుడ్ రేంజ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.
ఐదుగురు హీరోయిన్లతో సినిమా
తమిళ దర్శకుడు అట్లీతో ( Atlee) అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరియర్ లో 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇందులో.. దీపిక పదుకునే హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 800 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో దీపికతో పాటు మరో నలుగురు హీరోయిన్లు కూడా మెరువబోతున్నారట.
800 కోట్ల బడ్జెట్
అయితే ఆ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికతో పాటు జాన్వి కపూర్, మృనాల్, రష్మిక మందాన, అలాగే భాగ్యశ్రీ నటించబోతున్నట్లు కొత్తగా తెరపైకి కొత్త చర్చ వచ్చింది. నలుగురు హీరోయిన్లు.. సెకండ్ హాఫ్ లో పరిచయం అవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే, ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా వివరాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.


