
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా విషయంలో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘డిజాస్టర్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడితో సినిమా చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Key Points
అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
‘డిజాస్టర్’ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు.
అల్లు అర్జున్ తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)… రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప సినిమా (Pushpa ) తీయడంతో… అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా అంతర్జాతీయంగా పాపులర్ అయిపోయింది. పార్ట్ వన్, రెండో పార్ట్ 2 సక్సెస్ కావడంతో పాటు… హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ స్థాయి… అమాంతం పెరిగిపోయింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
అలాంటి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాలను.. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో (Trivikram) చేయాల్సిన సినిమాను పక్కకు పెట్టి… అట్లీతో (atlee)ముందుకు వెళ్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్టు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా ఉంటుందని కూడా.. జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డిజాస్టర్ దర్శకుడితో సహకారం?
అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయకుండా మరో కొత్త దర్శకుడితో.. అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరు ఊహించని… దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారట. అయితే ఆ దర్శకుడు… ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొంత మంది అల్లు అర్జున్ అంటే పడని వారు…. మెహర్ రమేష్ తో ఇవ్వబోతున్నాడని… సెటైర్లు పేల్చుతున్నారు.
అల్లు అర్జున్ ఎంచుకున్న దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రతిస్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి.

