
📌 Key Points
- అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్.. బ్లాక్ డ్రెస్సులో మెగా-అల్లు ఫ్యామిలీ సందడి!
- మార్చి 6న అల్లు శిరీష్, నయనికా రెడ్డి వివాహం.. మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి వాతావరణం నెలకొంది.
- రామ్ చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్ – స్నేహారెడ్డి జంటలు శిరీష్ – నయనికలతో కలిసి దిగిన వైరల్ ఫొటో!
- గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ డిజాస్టర్.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా రామ్ చరణ్!
అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి! అల్లు అర్జున్ తన తమ్ముడి కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ
తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఓ గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. దీనికి రామ్ చరణ్, ఉపాసన రావడంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మార్చి 6న అల్లు శిరీష్, నయనికా పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే.
మెగా-అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్-నయనికా రెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన ప్రీ-వెడ్డింగ్ పార్టీకి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
మెగా, అల్లు ఫ్యామిలీస్ ఆల్ ఇన్ బ్లాక్
హాజరైన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
కొద్దిరోజుల కిందట దుబాయ్‌లో నిర్వహించిన ‘యాట్ పార్టీ’ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో అల్లు కుటుంబం ఒక ప్రైవేట్ ప్రీ-వెడ్డింగ్ పార్టీని నిర్వహించింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.
తన సతీమణి ఉపాసన కామినేని కొణిదెలతో కలిసి చరణ్ ఈ వేడుకకు వచ్చాడు. కాబోయే జంట శిరీష్ – నయనికలతో కలిసి అల్లు అర్జున్ – స్నేహారెడ్డి, రామ్ చరణ్ – ఉపాసన దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరూ బ్లాక్ డ్రెస్సుల్లోనే ఫొటోలకు పోజులివ్వడం విశేషం.
టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు మెగా అభిమానులు, ఇటు అల్లు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం, అనుబంధం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న మెగా-అల్లు ఫ్యామిలీ ఫోటోలు
అల్లు అర్జున్, రామ్ చరణ్ కెరీర్ ఇలా..
ఇటు రామ్ చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ తో ఓ డిజార్టర్ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే అతనికి కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. గ్రాండ్ గా బారసాల కార్యక్రమం కూడా నిర్వహించాడు.
మెగా, అల్లు కుటుంబాల వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.


