|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ

Published: 11-09-2025, 11:45 AM
అల్లు అర్జున్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసిన 'లిటిల్ హార్ట్స్' మూవీ

ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాను అల్లు అర్జున్, నాని, రవితేజ వంటి ప్రముఖ హీరోలు ప్రశంసించడం విశేషం. మౌళి తనూజ్, శివానీ నటనకు ప్రశంసలు అందుకున్నారు.

‘లిటిల్ హార్ట్స్’ విజయం

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “లిటిల్ హార్ట్స్” సినిమా చూసి ఫ్రెష్ లవ్ స్టోరీ, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుందని ప్రశంసించారు.

అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. ఎలాంటి మెలొడ్రామా, సందేశాలు లేకుండా బాగా నవ్వించింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. మౌళి, శివానీ తమ పర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇతర నటీనటులంతా బాగా నటించారు.

సాయి మార్తాండ్ దర్శకత్వ ప్రతిభ నాకెంతో నచ్చింది. సింజిత్ మ్యూజిక్ రిఫ్రెషింగ్ గా అనిపించింది. లిటిల్ హార్ట్స్ లాంటి స్పెషల్ ఫిల్మ్ ను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్ కు నా అభినందనలు. అని ట్వీట్ చేశారు.

అల్లు అర్జున్ ప్రశంసలు

Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks , a sweet presence by @shivani_nagaram , and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg

— Allu Arjun (@alluarjun) September 11, 2025

ఇతర సెలబ్రిటీల స్పందన

“లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. తొలి షో నుంచే లిటిల్ హార్ట్స్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్ మాత్రమే కాదు.. నాని, రవితేజ లాంటి హీరోలు కూడా లిటిల్ హార్ట్స్ మూవీపై ప్రశంసలు కురిపించారు. హాస్యం, హృదయాన్ని హత్తుకునే సీన్స్, నిజాయతీతో కూడిన పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటీ లిటిల్ హార్ట్స్ మూవీలో ది బెస్ట్ అనిపించేలా ఉన్నాయి అని రవితేజ ప్రశంసించారు.

మొత్తంమీద, ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ప్రేక్షకులను, సెలబ్రిటీలను మెప్పించింది. ఫ్రెష్ కథ, అద్భుతమైన నటన సినిమా విజయానికి కారణమనిపించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.