|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బన్నీ ‘రాకా’ ఫస్ట్ లుక్: 800 కోట్ల భారీ విజువల్ ట్రీట్! జంతువులా బన్నీ ట్రాన్స్ఫర్మేషన్! షాకింగ్ అప్డేట్!

Published: 08-04-2026, 3:05 AM
బన్నీ 'రాకా' ఫస్ట్ లుక్: 800 కోట్ల భారీ విజువల్ ట్రీట్! జంతువులా బన్నీ ట్రాన్స్ఫర్మేషన్! షాకింగ్ అప్డేట్!
  • అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ విడుదల: సోషల్ మీడియాలో ట్రెండింగ్!
  • 800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం!
  • బన్నీ వింత జంతువుగా దర్శనం: ఊహించని ట్రాన్స్ఫర్మేషన్!
  • అట్లీ దర్శకత్వం: పాన్ వరల్డ్ మూవీగా రాకా విడుదల కానుంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’ చిత్రం ఒక సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. బన్నీ సరికొత్తగా కనిపిస్తున్నారు.

రాకా ఫస్ట్ లుక్: బన్నీ సరికొత్త అవతారం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో 800 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ గ్రాఫిక్స్ ప్రధానంగా ఉండే సినిమా అంటూ ముందు నుంచి ప్రచారం సాగుతోంది. ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు.

కానీ నేను అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఊహకి అందని విధంగా ఉంది. ఫస్ట్ లుక్ లో బన్నీ వింత జంతువు తరహాలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

800 కోట్ల బడ్జెట్: టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్!

The wait is over. Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe

— Allu Arjun (@alluarjun) April 8, 2026

అల్లు అర్జున్, అట్లీ కాంబో: సెన్సేషనల్ మూవీ!

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతటి డెడికేషన్ ప్రదరిస్తున్నాడో ఫస్ట్ లుక్ తోనే అర్థం అవుతోంది. స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన బన్నీ ఆ పేరుకు పూర్తి భిన్నంగా ఫస్ట్ లుక్ లో బట్టతల, భయంకరమైన చేతులు, గోర్లతో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం స్పేస్ సైన్స్, ఫిక్షనల్ అంశాలతో రూపొందుతోంది అని గతంలో వార్తలు వచ్చాయి. అంటే బన్నీ ఈ మూవీలో ఏలియన్ తరహా పాత్ర పోషిస్తున్నాడా అనే అనుమానాలు ఫస్ట్ లుక్ తో మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

‘రాకా’ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.