|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Allu Arjun : రెండు అవార్డులతో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఇక ఈ ఛాన్స్ ఎవరికీ రాదేమో..

Published: 30-05-2025, 11:55 AM
Allu Arjun : రెండు అవార్డులతో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. ఇక ఈ ఛాన్స్ ఎవరికీ రాదేమో..

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు, తెలంగాణ ప్రభుత్వం నుండి గద్దర్ అవార్డు అందుకోవడం ద్వారా అతడు సరికొత్త రికార్డును సృష్టించాడు.

Key Points

1

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.

2

తెలంగాణ ప్రభుత్వం నుండి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డును అందుకున్నాడు.

4

ఈ రికార్డు భవిష్యత్తులో మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు.

నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు

Allu Arjun : పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ జాతకమే మారిపోయింది. టాలీవుడ్ లెవల్ నుంచి నేషనల్ లెవల్ కి వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప 2 సినిమాతో ఏకంగా 1870 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డులను సైతం బద్దలుకొట్టాడు. ఇదంతా ఒక ఎత్తైతే నేషనల్ బెస్ట్ యాక్టర్ గా పుష్ప సినిమాకు అవార్డు అందుకొని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా నిలిచాడు. నేషనల్ అవార్డుతోనే మొదటి హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.

దానికి తోడు మరో అవార్డు ఇప్పుడు జతచేరింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఇస్తున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 సినిమాకు మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు సాధించాడు. బెస్ట్ యాక్టర్ గా తెలంగాణ స్టేట్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా మరో రికార్డ్ సెట్ చేసాడు.

గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు

ఇలా మొదటి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా, అలాగే బెస్ట్ యాక్టర్ గా మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ఈ రికార్డ్ బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో. భవిష్యత్తులో నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు వేరే హీరోలు అందుకోవచ్చు ఏమో గాని మొదటిసారి అనే రికార్డ్ మాత్రం అల్లు అర్జున్ పేరుమీదే. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సరికొత్త రికార్డు

అల్లు అర్జున్ సాధించిన ఈ అద్భుత విజయం అభిమానులను ఎంతో ఆనందంలో ముంచెత్తింది. ఈ రికార్డు అతని అభినందనీయమైన నటనకు నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.