
📌 Key Points
- బాలీవుడ్ జర్నలిస్ట్ స్వీకృతి యూట్యూబ్ ఛానల్ లో అల్లు అర్జున్ పై సంచలన ఆరోపణలు!
- అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ అంటూ కావేరి అనే అమ్మాయి సంచలన కామెంట్స్!
- ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ అని అల్లు అర్జున్ టీమ్ ప్రకటన, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక!
- పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ పై కావాలనే నెగిటివిటీ చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణ!
అల్లు అర్జున్ పై బాలీవుడ్ నెగిటివిటీ వెనుక అసలు కారణాలేమిటి? 42 రూల్స్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అల్లు అర్జున్ పై బాలీవుడ్ కుట్ర?
Allu Arjun : ఇటీవల బాలీవుడ్ జర్నలిస్ట్ స్వీకృతి యూట్యూబ్ ఛానల్ లో కావేరి అనే బ్రాండ్ మేనేజ్మెంట్ చేసే అమ్మాయితో ఇంటర్వ్యూ చేసారు. ఆమె అల్లు అర్జున్ ని కలవాలంటే, ఆయనతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయి. అవన్నీ పాటించాలి. షేక్ హ్యాండ్ ఇవ్వకుండదు, సర్ అని పిలవాలి, ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు.. ఇలాంటివి ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ 42 రూల్స్ అని ఓ పేపర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.(Allu Arjun)
ఇప్పటికే దీనిపై ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్ అని అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన చేసి వాళ్లపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. అలాగే ఫ్యాన్స్, నెటిజన్లు వీరిద్దరిపై తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా స్వీకృతి ఈ వీడియోని తన సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి డిలీట్ చేయడం గమనార్హం. అలాగే అల్లు అర్జున్ పై విమర్శలు చేసిన కావేరి కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్, లింక్డిన్ అకౌంట్స్ ని డిలీట్ చేసింది.
42 రూల్స్ అంటూ వైరల్ అవుతున్న వార్తలు!
అయితే ఇదంతా బాలీవుడ్ వాళ్ళు అల్లు అర్జున్ ని తొక్కడానికి చేస్తున్నారని. అల్లు అర్జున్ మీద కావాలనే నెగిటివిటి చేస్తున్నారని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు. గతంలో ప్రభాస్ ని కూడా సలార్ సమయంలో తొక్కడానికి థియేటర్స్ ఇవ్వకపోవడం , సినిమా గురించి బ్యాడ్ గా చెప్పడం.. ఇలా రకరకాలుగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పుష్ప 2తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాక బాలీవుడ్ లోని స్టార్స్ కంటే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నాడు. అందుకే బాలీవుడ్ వాళ్ళు ఇది ఓర్వలేకే ఇలా చేయిస్తున్నారని అంటున్నారు.
గతంలో పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ గురించి, ఆయనతో వర్క్ అనుభవం ఎలా ఉంటుందో గొప్పగా చెప్పారు. నటుడు జయరాం అలవైకుంఠపురం సినిమా సమయంలో అల్లు అర్జున్ తో ఉన్న సీన్ లో తెలుగు డైలాగ్స్ సరిగా చెప్పలేకపోతే అల్లు అర్జున్ ఆ డైలాగ్స్ పేపర్ మీద రాయించి తన నుదిటికి అతికించుకొని చూసి చెప్పమన్నాడని, అలా హెల్ప్ చేసాడని కూడా తెలిపారు.
ఫ్యాన్స్ ఆగ్రహం, సోషల్ మీడియాలో ఫైర్!
అలా అందరికి హెల్ప్ చేసే అల్లు అర్జున్ పై బాలీవుడ్ నెగిటివిటి చూపిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అసలు కామెంట్స్ చేసింది, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఏం సెలబ్రిటీలు కాదు, ఎవరో కూడా తెలీదు యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఇలా స్టార్స్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కూడా అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేసినప్పుడు ఎంత సపోర్ట్ చేసాడు బాలీవుడ్ ఇంటర్వ్యూలలోనే చెప్పాడు. ఆయనకు మేనేజర్ ఉండరు సెట్ లో డైరెక్ట్ గా వెళ్లి కావచ్చు అని కూడా గణేష్ ఆచార్య మాస్టర్ చెప్పాడు. దీంతో గతంలో సెలబ్రిటీలు అల్లు అర్జున్ గురించి చెప్పిన కామెంట్స్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ పై జరుగుతున్న ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


