
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అల్లు అర్జున్ ఒకే వేదికను పంచుకోనున్నారు. పుష్ప సినిమాలోని అద్భుతమైన నటనకు గుర్తింపుగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు.
Key Points
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకోనున్నారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గుర్తింపుగా ఈ అవార్డు.
హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ వేడుక జరుగుతుంది.
చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
అరుదైన కలయిక
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth reddy) అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu arjun ) ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డును ( Gaddar awards) అల్లు అర్జున్ అందుకోబోతున్నారు. పుష్ప సినిమాలో ( Pushpa) అల్లు అర్జున్ నటనను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది.
ఇక ఇవాళ సాయంత్రం.. హైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గద్దర్ అవార్డ్స్ అందజేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేడుకకు ప్రముఖ హీరోలు చిరంజీవి, బాలయ్య, అక్కినేని నాగార్జున అలాగే విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ కి సంబంధించిన మరికొంతమంది హాజరు కాబోతున్నారు. వీళ్ళందరూ సమక్షంలోనే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకుంటారు. ఇది ఇలా ఉండగా… సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత… అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు ఒకరోజు మొత్తం జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఆ తర్వాత… అల్లు అర్జున్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య మరికొన్ని సంఘటనలు జరిగాయి. సంధ్య థియేటర్ సంఘటన, అల్లు అర్జున్ అరెస్టుపై దాదాపు గంటసేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అయితే అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని కొంతమంది ఖండిస్తే… మరికొంతమంది ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు.
పుష్ప సినిమాకు గుర్తింపు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. నటుడు అల్లు అర్జున్ అరెస్ట్
ప్రముఖుల సమక్షంలో అవార్డు ప్రదానం
అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్‌పై ప్రశంసల జల్లు
బన్నీ కోసం ప్రత్యేక బ్యారక్ సిద్ధం చేసిన జైలు సిబ్బంది
చివరగా, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకోవడం సంతోషకరమైన విషయం. ఈ అవార్డు ఆయన నటనా ప్రతిభకు నిదర్శనం.


