|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఫ్లాప్ డైరెక్టర్‌తో బన్నీ ఫిక్స్! ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!!

Published: 08-01-2026, 9:30 PM
షాకింగ్: ఫ్లాప్ డైరెక్టర్‌తో బన్నీ ఫిక్స్! ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!!
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో దేశవ్యాప్తంగా క్రేజ్!
  • దర్శకుడు అట్లీతో ‘AA–24’ పాన్ వరల్డ్ మూవీ..హాలీవుడ్ స్థాయిలో!
  • గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘అల్లు సినిమాస్’ ప్రమోషన్ యాడ్స్!
  • త్వరలో సంక్రాంతికి ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. అభిమానులకు పండగే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సంచలనం. ‘పుష్ప 2’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆయన, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తో మన ముందుకు వచ్చారు. ఇంతకీ ఏమిటా న్యూస్?

అట్లీతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ మూవీ!

‘పుష్ప–2’తో అల్లు అర్జున్ (Allu Arjun)స్థాయి పూర్తిగా మారిపోయింది. ఐకాన్ స్టార్‌గా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ (Atlee)దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘AA–24’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుందని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ అల్లు అర్జున్ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవల ‘అల్లు సినిమాస్’ పేరుతో నిర్మించిన భారీ మల్టీప్లెక్స్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఫ్లాప్ డైరెక్టర్‌తో బన్నీ.. అసలు నిజం ఇదే!

ఈ సందర్భంగా తన తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్‌తో పాటు మామయ్య చిరంజీవి ఫొటోలను అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం విశేషం. సంక్రాంతి సినిమాలతో ‘అల్లు సినిమాస్’ లాంఛనంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఓ ఫ్లాప్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ‘కింగ్‌డమ్’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri)తో ఓ ప్రాజెక్ట్ ఉంటుందనే ప్రచారం సాగింది. దీంతో అది తెలుసుకున్న వారంతా షక్ అవుతున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అది సినిమా కాదని, ‘అల్లు సినిమాస్’ ప్రచారానికి సంబంధించిన యాడ్ షూట్స్ మాత్రమేనని వెల్లడించాడు. ఈ యాడ్స్‌కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపాడు.

‘అల్లు సినిమాస్’ ప్రమోషన్స్‌లో ఐకాన్ స్టార్!

ఈ విషయానికి సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఆ పోస్ట్‌కు ఆయన ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. ‘‘అల్లు సినిమాస్ కోసం ఒక ప్రచార ప్రకటన నిమిత్తం గౌతమ్‌తో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది. అతని విజన్, పనిపై ఉన్న నిజాయితీ నిజంగా అభినందనీయం. ప్రేమతో, ఆప్యాయతతో ఈ పనిని చేసినందుకు ధన్యవాదాలు. మేము రూపొందించినదాన్ని అందరూ చూడబోతుండటంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’’ అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.