|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లి: నయనిక ఇంటిలో అల్లు ఫ్యామిలీ సందడి! అసలేం జరిగిందంటే?

Published: 06-03-2026, 8:05 AM
అల్లు శిరీష్ పెళ్లి: నయనిక ఇంటిలో అల్లు ఫ్యామిలీ సందడి! అసలేం జరిగిందంటే?
  • అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.
  • నయనిక రెడ్డి ఇంట్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి చేసింది.
  • అల్లు స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
  • ఈరోజు అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లిరోజు కావడం విశేషం.

అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహం ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా నయనిక రెడ్డి ఇంట్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి చేసింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు తమ పిల్లలతో కలిసి వేడుకలో పాల్గొన్నారు.

అల్లు శిరీష్ – నయనిక రెడ్డి వివాహం

Allu Sirish – Nayanika Reddy: ఎట్టకేలకు అల్లు శిరీష్ (Allu Sirish) తన ప్రేయసి నయనిక రెడ్డి (Nayanika Reddy) తో ఈరోజు ఏడు అడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితులు , సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల నడుమ ఈ వేడుక అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం పూర్తయింది. పెళ్లి పత్రికలు కూడా అందరికీ పంచేశారు. పైగా మార్చి 2వ తేదీన ఘనంగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుల్లితెర నుండి వెండితెర వరకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యి సందడి చేశారు.

ఇకపోతే నేడు వివాహం జరగబోతున్న నేపథ్యంలో మరొకవైపు నయనికా రెడ్డి ఇంట్లో అల్లు ఫ్యామిలీ సందడి చేసింది. అల్లు అర్జున్ (Allu Arjun) ఆయన సతీమణి అల్లు స్నేహ రెడ్డి (Allu Sneha Reddy)తో పాటు వారి వారసులు అల్లు అర్హ, అల్లు అయాన్ లు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కాబోయే పిన్నిని దగ్గరుండి మరీ పెళ్లి కూతుర్ని చేసిన ఈ చిన్నారులు అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నయనికా రెడ్డి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. నయనికా రెడ్డిని అత్యంత సుందరంగా పెళ్లికూతురుని చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నయనిక రెడ్డి ఇంట్లో అల్లు ఫ్యామిలీ సందడి

ఇక్కడ పసుపు దంచే కార్యక్రమంలో నయనిక రెడ్డి మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తన సోదరీమణులతో ఆమె షేర్ చేసుకున్న ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇక కాబోయే కోడలికి అల్లు అరవింద్ , ఆయన సతీమణి అభినందనలు తెలియజేశారు. మొత్తానికైతే నయనిక ఇంట్లో పెళ్లి సందడి మొదలవ్వగా అక్కడ అల్లు కుటుంబం చేసిన హడావిడి ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలా నయనిక రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లిరోజు

ఇకపోతే ఈరోజు అల్లు అర్జున్, అల్లు స్నేహాల పెళ్లిరోజు కూడా కావడం విశేషం. దాదాపు 15 ఏళ్ల వైవాహిక బంధానికి అటు అల్లు స్నేహారెడ్డి, ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు తమ ప్రేమను ఒలకబోస్తూ తమ ప్రేమను కురిపించుకున్నారు. అలాగే తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. శిరీష్ కూడా తన అన్నయ్య పెళ్లి రోజే తన పెళ్లి కూడా జరగాలని ప్రత్యేకించి మరి మార్చి ఆరవ తేదీని ఆయన తన పెళ్లి రోజు గా ప్రకటించి..నేడు వివాహానికి సిద్ధమయ్యారు. ఇక ఈరోజు సాయంత్రం జరగబోయే పెళ్లి వేడుకల్లో సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ఈ ప్రేమ పక్షుల్ని జంటగా చూడాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Tags allu sirish nayani Share

మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అల్లు కుటుంబం నయనిక ఇంట్లో సందడి చేయడంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.