|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అయోధ్యలో రణబీర్ కపూర్ భారీ పెట్టుబడి: రాముడి జన్మభూమిలో కోట్ల విలువైన స్థలం!

Published: 15-05-2026, 5:30 PM
అయోధ్యలో రణబీర్ కపూర్ భారీ పెట్టుబడి: రాముడి జన్మభూమిలో కోట్ల విలువైన స్థలం!
  • రణబీర్ కపూర్ అయోధ్యలో రూ. 3.31 కోట్లతో 2,134 చ.అ. స్థలం కొనుగోలు.
  • ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ వారి ‘ది సరయూ’ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి.
  • ‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్.
  • అయోధ్యను రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారుస్తున్న సెలబ్రిటీలు.

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ అయోధ్యలో భారీగా పెట్టుబడి పెట్టారు. రూ. 3.31 కోట్లతో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో భూమిని కొనుగోలు చేశారు. ‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న ఆయనకు అయోధ్యతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

రణబీర్ కపూర్ అయోధ్యలో భారీ పెట్టుబడి

Ranbir Ayodhya : అయోధ్య అంటే ఒకప్పుడు రాములవారి గుడి.కాని ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి చూపు ఇప్పుడు సరయూ నది తీరం వైపు మళ్లింది. ఇప్పటికే బాలీవుడ్ షహన్‌షా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భారీగా పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలవగా, తాజాగా బాలీవుడ్ ‘చాక్లెట్ బాయ్’ రణబీర్ కపూర్ కూడా అయోధ్య పై కన్నేశాడు. సరయూ నది ఒడ్డున నిర్మిస్తున్న ఒక విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ కోట్లు పెట్టి భూమిని కొనడం చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

దీని విలువ దాదాపు  3.31 కోట్లు

రణబీర్ కపూర్ ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ (HoABL) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ది సరయూ’ అనే ప్రీమియం ప్రాజెక్ట్ లో సుమారు 2,134 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు రూ. 3.31 కోట్లు అని సమాచారం. సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. ఇందులో భారీ క్లబ్ హౌస్, అత్యాధునిక వసతులతో పాటు ప్రముఖ ‘ది లీల’ గ్రూప్ నిర్వహించే లగ్జరీ హోటల్ కూడా ఉండటం విశేషం. పవిత్రమైన సరయూ నది తీరాన, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఇలాంటి ఖరీదైన ఆస్తిని సొంతం చేసుకోవడం ద్వారా రణబీర్ తన ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియోను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు.

‘ది సరయూ’ ప్రాజెక్ట్ వివరాలు

రామాయణం’లో శ్రీరాముడి పాత్ర

ప్రస్తుతం రణబీర్ కపూర్, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారు. సుమారు రూ. 4,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న క్రమంలోనే ఆయనకు అయోధ్యతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ భూమి కొనుగోలుపై రణబీర్ స్పందిస్తూ.. “అయోధ్య నన్ను ఎంచుకుందని నేను నమ్ముతున్నాను. ఇది మన చరిత్ర, సంస్కృతిలో అంతర్భాగం. ఈ ప్రదేశం నా కుటుంబ వారసత్వంలో ఒక భాగంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. వెండితెరపై రాముడిగా కనిపించబోతున్న నటుడు, నిజజీవితంలో రాముడి జన్మస్థలంలో నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నాడన్న మాట.

రామాయణం సినిమాతో అయోధ్య అనుబంధం

35 కోట్ల వ్యయంతో ఏకంగా 2.67 ఎకరాల భూమి

అయోధ్యలో సెలబ్రిటీల సందడి ఈనాటిది కాదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ రారాజుగా దూసుకుపోతున్నారు. ఆయన 2024లో రూ. 14.5 కోట్లు, 2025లో రూ. 40 కోట్ల విలువైన ప్లాట్లు కొనుగోలు చేయగా, తాజాగా 2026 మార్చిలో రూ. 35 కోట్ల వ్యయంతో ఏకంగా 2.67 ఎకరాల భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. అమితాబ్ బాటలోనే ఇప్పుడు రణబీర్ కూడా చేరడంతో అయోధ్యకు మరింత గ్లామర్ తోడైందనే చెప్పాలి. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్టార్ హీరోలందరూ ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం అయోధ్య వైపు చూస్తున్నారంటే ఆశ్చర్యం లేదు .

రణబీర్ కపూర్ అయోధ్యలో భూమి కొనుగోలు చేయడం, ఆయన రాముడి పాత్ర పోషించడం యాదృచ్ఛికం కాదని, ఇది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని స్పష్టం అవుతోంది. అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇది మరింత ఊపునిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.