|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సినిమాలకు అల్లు శిరీష్ గుడ్ బై? మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

Published: 14-03-2026, 12:35 AM
షాకింగ్: సినిమాలకు అల్లు శిరీష్ గుడ్ బై? మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
  • అల్లు శిరీష్ సంచలన ప్రకటన: సినిమాలకు గుడ్ బై చెప్పేశారా?
  • ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో శిరీష్ కామెంట్స్ వైరల్
  • రిటైర్మెంట్ ప్రకటనపై మెగా అభిమానుల్లో రకరకాల చర్చలు
  • గీతా ఆర్ట్స్, ఆహా ఓటీటీ బాధ్యతల్లో అల్లు శిరీష్ బిజీ!

మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ సంచలన ప్రకటన చేశారు. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? ఈ షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అల్లు శిరీష్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం?

Allu Sirish: మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆయన తన భార్య నాయనికా రెడ్డితో కలిసి ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడ సందడి చేస్తున్న సమయంలో, కొంతమంది ఆయనతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించగా.. శిరీష్(Allu Sirish) అనూహ్యంగా స్పందించారు. “ఇవన్నీ నాకెందుకు.. నేను రిటైర్ అయిపోయిన వాణ్ణి” అంటూ ఆయన కామెంట్స్ చేశాడు. దీంతో అల్లు శిరీష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినిమాలపై ఆసక్తి లేదా? ఏం జరిగిందో తెలుసా?

అల్లు శిరీష్ చేసిన ఈ “రిటైర్మెంట్” కామెంట్స్ పై నెటిజన్ల నుంచి కూడా రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి. ఆయన నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పేశారా? లేక సరదాగా అన్నారా? అన్న చర్చ మొదలైంది. నిజానికి, అల్లు శిరీష్ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, బ్యాడ్ లక్ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాడు.

మెగా ఫ్యామిలీలో మరో షాకింగ్ నిర్ణయం!

అందుకే, సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అల్లు శిరీష్ సినిమాలకు స్వస్తి పలికినా, ఆయనకు కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. అల్లు అరవింద్ వారసుడిగా గీతా ఆర్ట్స్, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్, ఇప్పుడు మల్టీప్లెక్స్ లాంటి భారీ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన చూసుకోవడానికి, చేసుకోవడానికి బోలెడంత పని ఉంది. ఏది ఏమైనా, మెగా అభిమానులు మాత్రం శిరీష్ వ్యాఖ్యలను కేవలం సరదాగా చేసినవిగానే భావిస్తున్నారు. ఇక ఆయన నడిచిన బడ్డీ సినిమా తరువాత ఇప్పటివరకు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు ఈ హీరో.

అల్లు శిరీష్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన నిజంగానే సినిమాలకు దూరం అవుతారా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.