|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా కాంపౌండ్ లో పెళ్లి సందడి! అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కేది ఎప్పుడో తెలుసా? వైరల్ న్యూస్!

Published: 26-02-2026, 10:35 AM
మెగా కాంపౌండ్ లో పెళ్లి సందడి! అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కేది ఎప్పుడో తెలుసా? వైరల్ న్యూస్!
  • అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న అంగరంగ వైభవంగా జరగనుంది!
  • మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా!
  • గత ఏడాది అక్టోబర్ 31న అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక!
  • అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో హల్దీ ఫొటోలు షేర్ చేశారు!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది! అల్లు శిరీష్ త్వరలో తన జీవిత భాగస్వామిని ఎంచుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అభిమానుల్లో ఆనందం వెల్లువెరుస్తుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స్!

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహ తేదీ దగ్గరపడుతుండటంతో సెలబ్రేషన్స్ మొదలెట్టారు. తన ప్రియురాలు నయనిక(Allu Sirish – Nayanika)తో కలిసి మార్చి 6వ తేదీన పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటంటించారు. మార్చి 2వ తేదీన అల్లు స్టూడియోస్‌లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. దీంతో అల్లు వారి ఇంట వేడుకలు ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం హల్దీ ఫంక్షన్ వేడుకగా సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను అల్లు శిరీష్ వదిన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు అరవింద్ కుటుంబం. ఈ సందర్భంగా వారు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పట్లో పెళ్లి తేదీని వెల్లడించలేదు. ఈ ఏడాది పెళ్లి జరుగుతుందనే హింట్ అప్పుడే ఇచ్చారు. దీనికి అనుగుణంగానే తాజాగా మార్చి 6వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారు.

నయనకతో ఏడడుగులు వేయనున్న శిరీష్

అల్లు స్టూడియోలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

అల్లు శిరీష్ పెళ్లి వార్త మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వేడుకలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.