
📌 Key Points
- అల్లు శిరీష్, నయనికల పెళ్లికి ముహూర్తం ఖరారు: మార్చి 6న వివాహం!
- మెగాస్టార్ చిరంజీవికి మొదటి పెళ్లి పత్రిక అందజేసిన అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్!
- దుబాయ్ లో ఘనంగా జరిగిన అల్లు శిరీష్ – నయనిక ప్రీ వెడ్డింగ్ పార్టీ!
- అల్లు వారి ఇంట పెళ్లి సందడి ప్రారంభం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ లో మరో పెళ్లి సందడి మొదలైంది! అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అల్లు వారింట పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు వారింట పెళ్లి సందడి ప్రారంభం!
Allu Sirish Wedding : అల్లు వారింట పెళ్లి పనులు మొదలయ్యాయి. అల్లు శిరీష్ ఇటీవల నయనిక అనే అమ్మాయిని అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం నయనిక – అల్లు శిరీష్ దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒకటి కానుంది.
చిరంజీవికి మొదటి పెళ్లి పత్రిక!
అల్లు శిరీష్ నయనికల పెళ్లి మార్చ్ 6న జరగనుందని సమాచారం. ఇటీవల పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెట్టారని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. తాజాగా నేటి నుంచి పెళ్లి పిలుపులు మొదలుపెట్టారు. అల్లు శిరీష్ పెళ్లి మొదటి పత్రికని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖకు అల్లు అరవింద్, భార్య నిర్మల, అల్లు శిరీష్ కలిసి అందించారు.
మార్చి 6న అల్లు శిరీష్ పెళ్లి!
చిరంజీవికి పెళ్లి పత్రిక అందించిన ఫోటోని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికని మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాము అని రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. మొత్తానికి అల్లు వారింట పెళ్లి సందడి మొదలయింది. మార్చ్ 6న వీరి పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది.
అల్లు శిరీష్ పెళ్లి వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


