|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు శిరీష్ పెళ్లిలో మెగాస్టార్ మెరుపులు! పవన్, చరణ్, సూర్య సందడితో అల్లు వారి ఇంట పండగ!

Published: 06-03-2026, 9:05 PM
అల్లు శిరీష్ పెళ్లిలో మెగాస్టార్ మెరుపులు! పవన్, చరణ్, సూర్య సందడితో అల్లు వారి ఇంట పండగ!
  • మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోయారు; అతిథులను ఆహ్వానిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు!
  • పవన్ కళ్యాణ్ తన భార్య, కూతురుతో కలిసి సందడి చేశారు; రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
  • అల్లు శిరీష్‌, నయనికలను ఆశీర్వదించిన సీఎం రేవంత్‌ రెడ్డి; అల్లు అర్జున్ ఘన స్వాగతం పలికారు.
  • సూర్య, రాశీ ఖన్నా, వెంకటేష్, కళ్యాణ్ రామ్.. అల్లు శిరీష్ పెళ్లిలో తారల సందడి.

అల్లు శిరీష్ పెళ్లి టాలీవుడ్‌లో ఒక సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి నుండి పవన్ కళ్యాణ్ వరకు ఎందరో ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్ వైరల్!

అల్లు వారింట పెళ్లిసందడి కొనసాగుతోంది. గత వారం రోజులుగా.. అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అల్లుశిరీష్, నయనికల పెళ్లి వేడుక ముగిసింది. అల్లు అరవింద్‌ చిన్న కొడుకు, అల్లు అర్జున్‌ తమ్ముడు అల్లు శిరీష్‌ ఓ ఇంటి వాడు అయ్యాడు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అల్లు శిరీష్ ల పెళ్లి ప్రైవేట్ ఈవెంట్ గా జరిగింది. ఈ పెళ్లికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. టాలీవుడ్ ప్రముఖ తారలు, రాజకీయ నాయకులు హాజరయ్యి కొత్త జంటను విష్ చేశారు.

గత కొంత కాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వార్తల గురించి తెలిసిందే. కానీ ఈ పెళ్లిలో మాత్రం అల్లు మెగా ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేశారు. ఈ వెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోయారు. వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటూ.. ఈవెంట్ లో స్సెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

పవన్, చరణ్ సందడి.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వేడుక!

ఇక ఈ పెళ్లిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సందడిచేశారు. అయప్ప మాలలో ఉన్నరామ్ చరణ్.. తన బాబాయి పవన్ కళ్యాణ్ వెంటే కనిపించారు. ఆయనతో మాట్లాడుతూ.. సరదాగా టైమ్ గడిపారు. పవన్ కళ్యాన్ తన భార్య, చిన్న కూతురుతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు.

అల్లు శిరీష్‌, నయనికల వెడ్డింగ్‌ కి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు. రేవంత్ కు అల్లు అర్జున్ ఘన స్వాగతం పలికారు.. ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుతూ కనిపించారు. రేవంత్ రెడ్డి కూడా అల్లు అరవింద్ చేయి పట్టుకుని.. ఆప్యాయంగా మాట్లాడారు. కొద్ది సేపు చిరంజీవితో కూడా ముచ్చటించారు రేవంత్. ఈ పెళ్లిలో నూతన వధువరులు అల్లు శిరీష్‌, నయనికలతోపాటు సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా ఉన్నారు.

అల్లు శిరీష్, నయనికలను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి!

అల్లు శిరీష్ పెళ్లికి కోలీవుడ్ నుంచి స్టార్ హీరో సూర్య హాజరయ్యారు. సూర్య కొత్త జంటను ఆశీర్వదించారు, చిరంజీవితో కలిసి మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక సాయి ధుర్గతేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు.. సుస్మిత కొణిదెల కూడా ఈ పెళ్లాలో సందడి చేశారు. ఇక త్వరలో అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకగరాజ్ కూడా పెళ్లికి వచ్చారు. వీరితో పాటు హీరోయిన్ రాశీ ఖన్నా, స్టార్ సీనియర్ హీరో వెంకటేష్, కళ్యాణ్ రామ్  లాంటి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అల్లు శిరీష్ పెళ్లికి హాజరయ్యారు.

అల్లు శిరీష్ పెళ్లి వేడుక టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా, అల్లు ఫ్యామిలీల సందడితో ఈ వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.