
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ తక్కువగా ఉండటం, OG సినిమాపై ఉన్న హైప్ వల్ల నిర్మాత ఏఎం రత్నం బాధపడ్డారని తెలిసింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
Key Points
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందు అంచనాలు తక్కువగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG సినిమాపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ సినిమా హైప్ ను మరింత పెంచింది.
హరిహర వీరమల్లుపై తక్కువ అంచనాలు
AM Rathnam : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అయిదేళ్లుగా సాగడం, ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం, ఎక్కడా సినిమా గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడకపోవడంతో ఈ సినిమాపై గతంలో అసలు అంచనాలు లేవు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు. ఈ సినిమా ఉన్నా దీని తర్వాత రాబోయే OG సినిమా కోసమే అరిచేవారు ఫ్యాన్స్. ఆ సినిమాపై భారీ హైప్ ఉంది.
కానీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు పవన్ డైరెక్ట్ గా మొదటిసారి సినిమా ప్రెస్ మీట్ కి రావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
OG సినిమా హైప్
నేడు నిర్మాత ఏఎం రత్నం 10 టీవీతో మాట్లాడుతూ.. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టండి అన్నారు. సినిమా చాలా గొప్పగా ఉంది, దాని హైప్ తెలియట్లేదు ఎవరికీ. నేనే వస్తాను, నేనే మాట్లాడతాను అన్నారు. కంటెంట్ ఆయనకు బాగా నచ్చింది. అలాగే నా గురించి కూడా వచ్చారు. ఇన్ని రోజులు ఆయన ఎక్కడా హరిహర వీరమల్లు గురించి మాట్లాడలేదు. ఆయన బయట ఎక్కడా ఏ సినిమా గురించి మాట్లాడలేదు. కానీ ఫ్యాన్స్ అందరూ OG.. OG.. అని అరుస్తున్నారు. మా సినిమా గురించి ఎపుడూ అరవలేదు. మా సినిమా గురించి కూడా అరిస్తే బాగుండు అనుకున్నాను. దానికి నేను ఫీల్ అయ్యాను. ఇవాళ ఆయనే వచ్చి సినిమా గురించి చెప్పడంతో ఇంకా హైప్ పెరిగింది అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ప్రభావం
చివరగా, పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొనడంతో హరిహర వీరమల్లు సినిమాపై ఆసక్తి పెరిగింది. నిర్మాత వ్యక్తం చేసిన బాధ కూడా సినిమాపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.


