
అక్కినేని నాగార్జున సతీమణి అమల అక్కినేని తన కోడళ్ళు శోభిత ధూళిపాల, జైనబ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా కోడళ్ళు అద్భుతమైనవారు, వారి వల్ల నా ప్రపంచం మారింది” అని చెబుతూ, తాను డిమాండ్ చేసే అత్తను కాదని స్పష్టం చేశారు. వారి రాకతో తన జీవితం కొత్తగా మారిందని అమల ఆనందం వ్యక్తం చేశారు.
Key Points
అక్కినేని అమల తన కోడళ్ళు శోభిత ధూళిపాల, జైనబ్ గురించి మొదటిసారి స్పందించారు.
తన కోడళ్ళు అద్భుతమైనవారని, వారి రాకతో తన జీవితం కొత్తగా మారిందని అమల తెలిపారు.
తాను డిమాండ్ చేసే అత్తను కాదని, అందరం కలిసి సరదాగా గడుపుతామని అమల వివరించారు.
నాగ చైతన్య, అఖిల్ రాబోయే సినిమాల అప్‌డేట్‌లను కూడా ఈ సందర్భంగా పంచుకున్నారు.
అమల స్పందన: “నా కోడళ్ళు అద్భుతమైనవారు”
Amala Akkineni: అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయినా ఆమె తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. ఆ తరువాత నాగార్జునను పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత నుంచి ఇంటి భాద్యతల్లోనే బిజీ బిజీ గా గడిపారు అమల. అయితే, చాలా కాలం తరువాత ఆమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం సినిమాలలో తల్లి పాత్రలు చేశారు. ఇక మీడియాకి, సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటారు అమల. అలాంటి అమల చాలా కాలం తరువాత తన ముద్దుల ఇద్దరు కొత్త కోడళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. న కోడళ్ళు ఇద్దరు (Amala Akkineni)అద్భుతమైనవారు అంటూ ప్రశంసలు కురిపించింది.
Pawan Kalyan: పవన్ ని కలిసిన తమిళ నిర్మాత.. డేట్స్ ఫిక్స్ చేసిన టీం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
నాగార్జున కోడళ్ళు: శోభిత, జైనబ్ గురించి అమల
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కోడళ్ళు శోభిత ధూళిపాల, జైనబ్ గురించి మాట్లాడుతూ.. “నా ఇద్దరు కోడళ్లు అద్భుతమైనవారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా మారింది. నాకొక ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది. వాళ్ళు ఇద్దరూ చాలా బిజీగా ఉంటారు. అది చాలా మంచి విషయంగా భావిస్తాను. యువత ఎప్పుడు ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటాను. అలా వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే.. నేను నా పనుల్లో బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తాం. అలాగే, నేను డిమాండ్ చేసే అత్తను కాదు, డిమాండ్ చేసే భార్యను కాదు” అంటూ చెప్పుకొచ్చింది అమల. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని హీరోల నెక్స్ట్ ప్రాజెక్ట్స్
ఇక అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం నాగ చైతన్య దర్శకుడు కార్తీక్ వర్మతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అఖిల్ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయినా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.
మొత్తంమీద, అమల తన కోడళ్ళ పట్ల చూపిన ప్రేమ, గౌరవం అక్కినేని కుటుంబంలో ఎంతటి సంతోషం ఉందో తెలియజేస్తుంది. వారి వ్యక్తిగత జీవితంతో పాటు, నాగ చైతన్య, అఖిల్ సినిమాల అప్‌డేట్‌లు అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చాయి.


