|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమర్దీప్ జీవితంలో రవితేజ సంచలనం! ఇంతకీ ఏమిచ్చారు?

Published: 10-02-2026, 1:35 AM
అమర్దీప్ జీవితంలో రవితేజ సంచలనం! ఇంతకీ ఏమిచ్చారు?
  • అమర్దీప్ చౌదరి ‘సుమతీ శతకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
  • రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పై అమర్దీప్ కి సినిమాలో అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు.
  • అమర్దీప్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
  • రవితేజ అంటే అమర్దీప్ కి ఎంతో అభిమానం, ఆయనను చూస్తూ పెరిగానని తెలిపారు.

అమర్దీప్ చౌదరికి రవితేజ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. బిగ్ బాస్ వేదికపై రవితేజ అమర్దీప్ కు తన సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. అమర్దీప్ నటించిన ‘సుమతీ శతకం’ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైంది.

అమర్దీప్ చౌదరి సినీ ప్రస్థానం

Amardeep: అమర్దీప్ చౌదరి (Amardeep Chowdary).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకు చెందిన అమర్దీప్ 1990 నవంబర్ 20న అనంతపురం జిల్లాలో జన్మించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమర్దీప్ చౌదరి ఇండస్ట్రీలో నటుడిగా సెటిల్ అవ్వాలనే నేపథ్యంలో సీరియల్స్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా సిరిసిరిమువ్వలు జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే సీరియల్స్ చేస్తూ బుల్లితెరకే పరిమితమైన అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని…తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా.. బీటెక్ విద్యార్థుల కష్టాలను అందరికీ తెలియజేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 లో విన్నర్ గా టైటిల్ సొంతం చేసుకుంటారని అనుకున్నారు. కానీ సడన్గా కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన పర్ఫామెన్స్ తో ఏకంగా టైటిల్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిగ్ బాస్ ద్వారా అందుకున్న క్రేజ్ తో సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన అమర్దీప్ ని చూసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అలా ఈ ఏడాది ‘సుమతీ శతకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అమర్దీప్ చౌదరి.. ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ మేరకు ఆయన హోమ్ టూర్ వీడియో కూడా హల్చల్ చేస్తోంది.

రవితేజ ఇచ్చిన హామీ

నిజానికి అమర్దీప్ కి హీరో రవితేజ(Raviteja ) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనను చూస్తూ పెరిగిన అమర్దీప్.. ఆయన సినిమాలో ఒక్క చిన్న పాత్ర అయినా చేయాలని పరితపించారు కూడా.. పైగా బిగ్ బాస్ సీజన్ 7లో రవితేజ హెయిర్ స్టైల్ తో అందరిని ఆకట్టుకున్నారు. అటు రవితేజ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు కూడా తన సినిమాలో అవకాశం కల్పిస్తానని అమర్దీప్ కి మాట ఇచ్చారు. దీనికి తోడు ఇప్పుడు అమర్దీప్ ‘సుమతీ శతకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమయంలో కూడా ఆయన టీజర్, అమర్ నటనపై సంతోషం వ్యక్తం చేస్తూ గొప్ప నటుడు అవుతావని చెప్పడంతో అమర్దీప్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.

‘సుమతీ శతకం’ సినిమాతో అమర్దీప్

ఇదిలా ఉండగా అమర్దీప్ కి హీరో రవితేజ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక తన అభిమాన హీరో ఆ గిఫ్ట్ ఇవ్వడంతో తన ఇంట్లో ఆ గిఫ్ట్ కి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారనే చెప్పాలి.హోమ్ టూర్ లో భాగంగా అమర్దీప్ తల్లి రూప మాట్లాడుతూ..” అమర్దీప్ ఫోటో పైన రవితేజ సైన్ చేసి ఇచ్చారు. అది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ప్రత్యేకం. అందుకే మా ఇంటి సెల్ఫ్ లో ప్రథమ స్థానంలోనే ఆ ఫోటోకి స్థానం కల్పించాము” అంటూ ఆ విషయం చెబుతూ రూప సంతోషం వ్యక్తం చేశారు.. ఆ కుటుంబానికి కూడా రవితేజ అంటే ఎంత అభిమానమో ఈ ఒక్క ఫోటోతో స్పష్టం అవుతోంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇలాంటి అభిమాని ఉన్న రవితేజ నిజంగా గ్రేట్ అంటూ కూడా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

మొత్తానికి, అమర్దీప్ రవితేజ గారి అభిమాని కావడం, రవితేజ స్వయంగా ప్రోత్సహించడం ఆయన సినీ జీవితానికి ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.