|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమర్ దీప్ vs సోహెల్: బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్! కౌంటర్ ఎటాక్ తో దుమారం

Published: 26-01-2026, 8:05 AM
అమర్ దీప్ vs సోహెల్: బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్! కౌంటర్ ఎటాక్ తో దుమారం
  • అమర్ దీప్ హీరోగా ‘సుమతి శతకం’ మూవీ రిలీజ్ కి సిద్ధం!
  • బిగ్ బాస్ ఓట్లు సినిమాలకు పనికిరావు: అమర్ దీప్ సంచలన వ్యాఖ్యలు
  • సోహెల్ నటించిన ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా ఫ్లాప్ పై సెటైర్లు!
  • లేట్ అయినా సక్సెస్ వస్తుంది, ఓపిక పట్టాలి: అమర్ దీప్ స్పీచ్ వైరల్

బిగ్ బాస్ ఫేమ్ తో వెలుగులోకి వచ్చిన అమర్ దీప్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. సోహెల్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి.

అమర్ దీప్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Amardeep : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది సినిమాల్లో హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిద్దాం అని కలలు కంటారు. కానీ అందులో కొంతమందే సక్సెస్ అవుతారు. సీరియల్ నటుడు, బిగ్ బాస్ 7 రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అమర్ దీప్ హీరోగా నటించిన సుమతి శతకం త్వరలో రిలీజ్ కానుంది.(Amardeep)

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా ఇవి బిగ్ బాస్ ఫేమ్, నటుడు సయ్యద్ సోహెల్ కి కౌంటర్ అని అంటున్నారు నెటిజన్లు.

సోహెల్ కి కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్?

అమర్ దీప్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదా అని మన సినిమాకు థియేటర్ కి వస్తారు అని ఊహించి సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసుకొని సినిమాకు రప్పించాలి కానీ బిగ్ బాస్ ఓట్లు సినిమాలకు పనికిరావు. బిగ్ బాస్ లో నువ్వు విన్నర్ అయినా , సెకండ్ ప్లేస్ అయినా, ఏ ప్లేస్ లో వచ్చినా అది ఒక రోజు మాత్రమే. ఈవెంట్లు చేసుకో, ఓపెనింగ్స్ చేసుకో, స్టేజి షోలకు వెళ్తాము అంతే కానీ బిగ్ బాస్ దేనికి పనికి రాదు. అక్కడొచ్చిన పేరుని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. లేట్ అయినా సక్సెస్ వస్తుంది ఓపిక పట్టాలి అని అన్నాడు.

అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం సోహెల్ హీరోగా, నిర్మాతగా తెరకేకించిన బూట్ కట్ బాలరాజు అనే సినిమా ఫ్లాప్ అవ్వగా కెమెరా ముందుకొచ్చి.. బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదరా ఎక్కడరా మీరంతా సినిమాకు రాలేదు అంటూ ఏడ్చాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అవ్వగా సోహెల్ పై విమర్శలు కూడా వచ్చాయి.

బిగ్ బాస్ ఫేమ్ పై సంచలన వ్యాఖ్యలు!

దీంతో ఇప్పుడు అమర్ దీప్ మాట్లాడిన వ్యాఖ్యలు సోహెల్ కి కౌంటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అమర్ దీప్ కానీ, సోహెల్ కానీ స్పందిస్తారేమో చూడాలి.

అమర్ దీప్, సోహెల్ మధ్య మాటల యుద్ధం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ త్వరలో అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.