|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

15 నిమిషాల క్యామియోకు రూ.20 కోట్లా? కూలీ సినిమా కోసం ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంత?

Published: 13-08-2025, 1:42 AM

రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ 15 నిమిషాల క్యామియో చేశారని, దానికి రూ.20 కోట్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ నిజం వేరు…

Key Points

1

కూలీ సినిమాలో ఆమిర్ ఖాన్ 15 నిమిషాల క్యామియో చేశారు.

2

ఆయన ఈ క్యామియో కోసం ఏ రెమ్యునరేషన్ తీసుకోలేదు.

4

ఆమిర్ ఖాన్ స్క్రిప్ట్ వినకుండానే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.

ఆమిర్ ఖాన్ క్యామియో రెమ్యునరేషన్

కూలీ సినిమా విడుదల కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకు కౌంట్ డౌన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ట్రైలర్ లో దహాగా తన ఇంటెన్సివ్ అవతారంతో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఈ చిత్రంలో ఒక హైలైట్ గా నిలిచాడు. అయితే ఈ సినిమాలో తన క్యామియో కోసం ఆమిర్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

కూలీ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యామియో 15 నిమిషాల నిడివి ఉండబోతోంది. ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం ఆమిర్ ఖాన్ రూ.20 కోట్లు తీసుకున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అసలు నిజం ఏమిటంటే? ఈ కూలీ మూవీ కోసం ఆమిర్ ఖాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా కోసం ఆమిర్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ , కూలీ టీంపై అమీర్ ఖాన్ కు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. పూర్తి కథ కూడా వినకుండానే వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు.

రజనీకాంత్ పై ఆమిర్ ఖాన్ గౌరవం

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ పై తన ప్రేమను చూపించే మార్గమని భావించిన ఆమిర్ ఖాన్.. తన పాత్ర కోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతకు ముందు హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆమిర్ మాట్లాడుతూ.. ‘‘ లోకేష్ నన్ను కలవడానికి వచ్చారు. అతను నన్ను కలవడానికి ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు. ‘ఇది కూలీ కోసం. ఈ సినిమాలో నువ్వు ఓ పాత్ర చేయాలి’ అని అడిగాడు’’ అని ఆమిర్ ఖాన్ తెలిపాడు.

‘‘అది కూలీ, రజనీ సార్ సినిమా అని తెలిసిన మరుక్షణం చాలా సంవత్సరాల తర్వాత బహుశా మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా, ఏమీ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పా’’ అని ఆమిర్ ఖాన్ చెప్పాడు.

కూలీ సినిమా విడుదల తేదీ

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కూలీలో రజనీకాంత్, నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రచితా రామ్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, కన్నా రవి, మోనిషా బ్లెస్సీ, కాళి వెంకట్, చార్లే తదితరులు కూడా యాక్ట్ చేశారు. సన్ పిక్చర్స్ సమర్పణలో రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రం ఇది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వార్ 2’తో ఇది పోటీ పడనుంది.

చివరగా, ఆమిర్ ఖాన్ తన స్నేహం, గౌరవం కారణంగా కూలీ సినిమాకు ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.