
ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు వసూళ్లు రూ.11.5 కోట్లు. గత చిత్రాలతో పోల్చితే ఇది మెరుగైనదే అని చెప్పవచ్చు.
Key Points
ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' తొలిరోజు వసూళ్లు రూ.11.5 కోట్లు.
గత చిత్రాలతో పోలిస్తే వసూళ్లు కాస్త మెరుగ్గా ఉన్నాయి.
పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, ఆమిర్ ఖాన్ స్టార్‌డమ్‌కి ఇది తక్కువనే అభిప్రాయం.
8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ విధానంలో రిలీజ్.
తొలిరోజు వసూళ్లు
రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తో వస్తే దారుణమైన డిజాస్టర్. 2022లో ‘లాల్ సింగ్ చద్దా’తో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన ఆమిర్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘సితారే జమీన్ పర్’ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలిరోజు ఎంత కలెక్షన్ వచ్చాయంటే?
స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’కి రీమేక్‌గా ‘సితారే జమీన్ పర్’ సినిమా తీశారు. రిలీజ్‌కి ముందే ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావుడి చేశాడు గానీ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.11.5 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన హిందీ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ స్టార్‌డమ్‌కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు.
ఆమిర్ ఖాన్ కెరీర్ పై ప్రభావం
ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలిరోజు రూ.10-20 కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది ఆమిర్ ఖాన్ సినిమాకు తొలిరోజు దాదాపు రూ.11 కోట్లు మేర వసూళ్లు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్‌లో ఈ నంబర్స్ పెరగొచ్చేమో చూడాలి? ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని ఆమిర్.. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.
సినిమా కథాంశం
‘సితారే జమీన్ పర్’ విషయానికొస్తే.. ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా గుల్షన్ అరోరా(ఆమిర్ ఖాన్) పనిచేస్తుంటాడు. హెచ్ కోచ్‌తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్ట్.. శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్‌గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో గుల్షన్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‍లో ‘సితారే’ టీమ్ గెలిచిందా అనేది మిగతా స్టోరీ.
చివరిగా, ‘సితారే జమీన్ పర్’ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. యూట్యూబ్‌లో రిలీజ్ వల్ల మరింత ఆదాయం రావచ్చు.


