|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ముంబైలో 12 అపార్టమెంట్లు ఉన్నా అద్దె ఇంట్లో జీవిస్తున్న అమీర్ ఖాన్; నెలకు ఆయన చెల్లించే అద్దె ఎంతో తెలుసా?

Published: 21-08-2025, 8:17 AM
ముంబైలో 12 అపార్టమెంట్లు ఉన్నా అద్దె ఇంట్లో జీవిస్తున్న అమీర్ ఖాన్; నెలకు ఆయన చెల్లించే అద్దె ఎంతో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముంబైలో 12 అపార్ట్‌మెంట్ల యజమాని అయినప్పటికీ, ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన నెలవారీ అద్దె, ఆస్తుల విలువ మరియు ఈ నిర్ణయానికి కారణాలను తెలుసుకుందాం.

Key Points

1

ముంబైలో 12 అపార్ట్‌మెంట్లు ఉన్నప్పటికీ, అమీర్ ఖాన్ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

2

ఆయన నెలకు రూ. 24 లక్షలు అద్దె చెల్లిస్తున్నారని సమాచారం.

4

అద్దె ఒప్పందం కోసం కోటి 46 లక్షలకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశారు.

అమీర్ ఖాన్ యొక్క భారీ ఆస్తులు

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ ఒకడు అతడు ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు. అతని ఆస్తి కూడా తక్కువేమీ కాదు.. దాదాపు 2000 కోట్ల వరకు రూపాయల వరకు ఉంటుంది. ముంబైలో కనీసం 12 ఫ్లాట్లు కూడా ఉంటాయి. అయినా కూడా అమీర్ ఖాన్ తన సొంత ఇళ్లలో కాకుండా అద్దె ఫ్లాట్లోకి మారిపోయాడు. సొంత ఇల్లు ఉండి కూడా ఇలా అద్దె ఫ్లాట్లో ఎందుకు ఉంటున్నాడు?

అద్దె ఇంటికి మారడానికి కారణం

ఫోర్బ్స్ చెబుతున్న డేటా ప్రకారం అమీర్ ఖాన్‌కు దాదాపు 1862 కోట్ల రూపాయల సంపద ఉంది. ముంబైలో 12 దాకా అపార్టుమెంట్లు ఉన్నాయి. అయినా కూడా ఆయన బాంద్రా వెస్ట్ లో ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. పోలీసులు నాలుగు లక్షలు అపార్ట్మెంట్లను అద్దెకి తీసుకున్నారు. ఈ అపార్ట్మెంట్లన్నింటికీ కలిపి 24 లక్షల అద్దెను చెల్లిస్తున్నారు. ప్రతి ఏడాది ఐదు శాతం పెరుగుతూ ఉంటుంది. రాబోయే ఐదు సంవత్సరాల కోసం ఈ అద్దె ఫ్లాట్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అద్దె ఒప్పందం కోసం కోటి 46 లక్షలకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశాడు. అమీర్ ఖాన్ ఇక స్టాంప్ డ్యూటీ నాలుగు లక్షల రూపాయలు చెల్లించాడు.

అద్దె మరియు ఇతర ఖర్చులు

అమీర్ ఖాన్‌కు విర్గో హౌసింగ్ సొసైటీలోనే 12 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ఈ అపార్ట్మెంట్లు అన్నిట్లోనూ హై ప్రొఫైల్ స్థాయిలో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. దీన్ని అల్ట్రా ప్రీమియంగా మారుస్తున్నారు. వీటిని సముద్రముఖంగా అంటే ఈ అపార్ట్మెంట్‌ల నుంచి సముద్రం అందంగా కనిపించేలా రీమోడలింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అపార్ట్మెంట్ల రేట్లు మరింత పెరుగుతాయి. ఈ ఫ్లాట్ల ధరలు 100 కోట్లు రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది. అందుకే అక్కడ అభివృద్ధి పనులు జరిగే వరకు అమీర్ ఖాన్ అద్దె ఇంట్లోకి మారాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ అద్దెకు తీసుకున్న ప్రాంతంలోనే ఎంతోమంది బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కూడా అదే ప్రాంతంలో ఉన్నాడు.

అమీర్ ఖాన్ యొక్క అద్దె ఇంటి నివాసం, ఆయన ఆస్తుల విలువను, అభివృద్ధి పనుల ప్రభావాన్ని చూపిస్తుంది. స్టార్ హీరోల జీవనశైలి గురించి ఆలోచింపజేసే విషయం ఇది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.