|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు: నమ్మకం, నిజాయితీ, మనసు వెన్నలా!

Published: 22-09-2025, 6:13 AM
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు: నమ్మకం, నిజాయితీ, మనసు వెన్నలా!

న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి తెలుసుకోవచ్చు. ఈ కథనంలో, రాడిక్స్ నెంబర్ 2 ఉన్న అమ్మాయిల గురించి తెలుసుకుందాం.

Key Points

1

రాడిక్స్ నెంబర్ 2 ఉన్న అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు.

2

2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారి రాడిక్స్ నెంబర్ 2.

4

స్వచ్ఛమైన హృదయంతో, ప్రశాంతంగా ఉంటారు.

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 2

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీ లో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా మనిషి ఆలోచన విధానం, అలవాట్లు, ప్రత్యేకత ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పొచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఏమైనా షేర్ చేసుకున్నా ఇతరులకు చెప్పరు. దీంతో పొరపాటున ఏ విషయాలైనా చెప్పినా భయపడక్కర్లేదు. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను నమ్మొచ్చు? ఎవరి వలన నష్టం ఉండదు?

రాడిక్స్ నెంబర్ 2 వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ రెండు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. చంద్రుడు మెదడు, ఆలోచనలు, భావాలు, మానసిక స్థితి వంటి వాటికి కారకుడు. చంద్రుడు మానసిక ప్రశాంతతని పెంపొందించి ప్రశాంతంగా ఉంచుతాడు.

నమ్మదగ్గవారి లక్షణాలు

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మేయచ్చు. రిలేషన్‌షిప్‌లో నిజాయితీ గా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నమ్మకాన్ని ఏ మాత్రం బ్రేక్ చేయరు. వారు ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన హృదయంతో ఇతరులను ప్రేమిస్తారు.

ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటారు

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ నెమ్మదిగా ఉంటారు. జీవితంలో ప్రశాంతత ఉండేటట్టు చూసుకుంటారు. బ్యాలెన్స్ జీవితం ఉండాలని అనుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడరు, తొందరపడరు. పరిస్థితిని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటారు. వారికి తగ్గట్టుగా పరిస్థితిని మార్చుకుంటారు.

సంబంధాలలో వారి ప్రవర్తన

రాడిక్స్ నెంబర్ రెండు వారికి క్రియేటివిటీ కూడా ఎక్కువ. ఎప్పుడూ కూడా ప్రేమించిన వ్యక్తిని సంతోషంగా చూసుకుంటారు. పైగా వీరి మనసు కూడా వెన్నలా ఉంటుంది. స్వచ్ఛమైన హృదయంతో ఇతరుల మనసుని దోచుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను నమ్మిన ఏమాత్రం నష్టం ఉండదు. ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళిపోయే రకం కాదు. స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ సమాచారం సూచనార్థం మాత్రమే. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. నమ్మకం, ప్రేమ, విశ్వాసం అన్నీ ముఖ్యమైనవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.