|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘అనగనగా ఒక రాజు’లో ఊహించని ట్విస్ట్! కామెడీతో పాటు రాజకీయ వ్యంగ్యం కూడా!

Published: 13-01-2026, 6:30 AM
షాకింగ్: 'అనగనగా ఒక రాజు'లో ఊహించని ట్విస్ట్! కామెడీతో పాటు రాజకీయ వ్యంగ్యం కూడా!
  • నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికి విడుదల కానుంది.
  • సినిమాలో కామెడీతో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని నాగ వంశీ తెలిపారు.
  • మొదటి భాగం సరదాగా, రెండవ భాగం పొలిటికల్ సెటైర్‌గా ఉండబోతుంది.
  • హీరో డబ్బు కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది.

నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని నిర్మాత నాగ వంశీ తెలిపారు. సినిమా విడుదల గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సినిమాలో కామెడీ మరియు పొలిటికల్ టచ్

Anaganaga Oka Raju: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం మరోసారి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగ వంశీ పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో జరిగింది కానీ నిర్మాత నాగ వంశ హాజరు కాలేకపోయిన. తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొని సినిమా గురించి మాట్లాడుతూ అసలు స్టోరీ బయట పెట్టారు.

ఈ సందర్భంగా నాగ వంశీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ సినిమా కామెడీ జోనర్ లోనే ఉంటుందని అందరూ భావించారు కానీ కామెడీతో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని ఈయన తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం సరదా సరదాగా సోగ్గాడే చిన్నినాయన సినిమా తరహాలో ఉండబోతుందని తెలిపారు. ఇక సెకండ్ హాఫ్ పొలిటికల్ సెటైర్ గా ఉండబోతుందని తెలిపారు. పొలిటికల్ సెటైర్ అంటే ఎవరిని కించపరిచే విధంగా సినిమా ఉండదు కానీ ఫన్ గానే పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని ఈ విషయాన్ని మేము ట్రైలర్ లో దాచాము కానీ రేపు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రివిల్ చేస్తున్నాము అంటూ నాగ వంశీ తెలియజేశారు.

నాగ వంశీ వెల్లడించిన అసలు కథ

ఈ సినిమాలో హీరోకి డబ్బు అవసరం అవుతుంది అలా డబ్బు అవసరమైనప్పుడు పొలిటికల్ పరంగా వెళ్లి డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనలో పాలిటిక్స్ వైపు హీరో అడుగులు వేస్తారని ఈ సందర్భంగా నాగ వంశీ తెలియజేశారు. ఇలా కామెడీ మాత్రమే కాకుండా పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నాగవంశీకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. గత కొద్దిరోజులుగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

అంచనాలు పెంచిన సినిమా అప్డేట్స్

ఇక ఇప్పటివరకు అనగనగా ఒక రాజు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)కి జోడిగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary)హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సింగర్ సమీరా భరద్వాజ్, సత్య శ్రీ, చమ్మక్ చంద్ర, మహేష్, బుల్లి రాజు వంటి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందనే విషయాన్ని తెలియ చేయడంతో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

మొత్తానికి ‘అనగనగా ఒక రాజు’ సినిమా కామెడీతో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉండటంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని ఆశిద్దాం. ఈ సినిమా నాగ వంశీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.