|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మురేపే న్యూస్: ‘అనగనగా ఒక రాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎక్కడో తెలుసా?

Published: 06-02-2026, 4:05 AM
దుమ్మురేపే న్యూస్: 'అనగనగా ఒక రాజు' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎక్కడో తెలుసా?
  • నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా ‘అనగనగా ఒక రాజు’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది!
  • ఫిబ్రవరి 11, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీ!
  • థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
  • సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో మారి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో దుమ్ము రేపడానికి సిద్ధం!

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం రండి! అభిమానులకు పండగే.

ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’ మూవీ!

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తాజాగా న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీకు మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మారి(Mari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేసింది. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14 న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి మంచి విజయంతో పాటు కలెక్షన్స్ కూడా సాధించింది.

అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌(Net Flix)లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11, 2026 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ సెక్షన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాల్సి ఉంది.

స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..?

నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ రిలీజ్..!

థియేటర్లలో అలరించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.