
📌 Key Points
- నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అదుర్స్ అని ట్వీట్స్
- గోదావరి యాస, ఎటకారపు డైలాగులకు విజిల్స్ పడుతున్నాయంటున్న నెటిజన్లు
- మీనాక్షి చౌదరి గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటున్న టాక్
- చమ్మక్ చంద్ర, రావు రమేష్ పాత్రలకు ప్రశంసలు
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం!
ట్విట్టర్లో నవీన్ కామెడీ ట్రెండింగ్
Anaganaga Oka Raju : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. చమ్మక్ చంద్ర, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. నవీన్ కామెడీ అదిరిపోయిందని చెబుతున్నారు. గోదారోళ్ల ఎటకారం పంచులు హైలెట్‌గా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.
గోదావరి యాసలో పంచ్ డైలాగులు అదుర్స్
సినిమాకు మీనాక్షి గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్
నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


