|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇది కదా సక్సెస్ అంటే.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోపే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. సుమంత్ పాఠాలకు ఫ్యాన్స్ ఫిదా

Published: 16-05-2025, 7:50 AM
ఇది కదా సక్సెస్ అంటే.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోపే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. సుమంత్ పాఠాలకు ఫ్యాన్స్ ఫిదా

ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన అనగనగా సినిమా అనూహ్య విజయం సాధించింది. రెండు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌తో రికార్డు సృష్టించింది. సుమంత్ నటన ప్రేక్షకులను మెప్పించింది.

Key Points

1

ఓటీటీలో రెండు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్!

2

సుమంత్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు

4

సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలతో కలిసి చూడటానికి అనువైన చిత్రం

అనగనగా: ఓటీటీ సెన్సేషన్

ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ అనగనగా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తోంది. మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ టీచర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఈ సినిమాను రూపొందించారు. గురువారం (మే 15) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సుమంత్ లీడ్ రోల్లో నటించిన అనగనగా మూవీ ఓటీటీ లోకి అడుగుపెట్టి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే 50 మిలియన్ల అంటే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. గురువారం (మే 15) ఓటీటీలోకి వచ్చే ముందు బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. పలువురు సెలబ్రిటీలతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ చూశారు.

సుమంత్ పాత్రకు ప్రేక్షకుల స్పందన

అప్పటి నుంచే పాజిటివ్ రివ్యూలు రావడం మొదలయ్యాయి. దీంతో ఓటీటీలోకి రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు. సుమంత్ చెప్పే పాఠాలు వాళ్లను బాగానే ఆకర్షిస్తున్నట్లు తాజాగా అనగనగా మూవీ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు చూస్తే అర్థమవుతోంది.

అనగనగా మూవీని సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కాజల్ చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది. సుమంత్ ఇందులో వ్యాస్ అనే ఓ కథల టీచర్ గా నటించాడు. పిల్లలకు కథల ద్వారా పాఠాలు చెప్పి వాళ్లలో క్రియేటివిటీని పెంచాలని ఆరాటపడే టీచర్ అతడు. కానీ ఓ మూస ధోరణికి అలవాటు పడిన మన విద్యావ్యవస్థ అతన్ని పట్టించుకోదు. ఈ సినిమాలో సుమంత్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

విద్యా వ్యవస్థపై ఆలోచింపజేసే కథ

ప్రీమియర్ షోలతోపాటు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ పెరగడంతో క్రమంగా అనగనగాను చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లోనే ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఇలా రెండు రోజుల్లోపే రికార్డు వ్యూస్ సాధ్యమయ్యాయి. ఈ లో బడ్జెట్ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది.

సుమంత్ నటనతో పాటు, విద్యా వ్యవస్థపై సందేశాత్మకమైన కథాంశంతో అనగనగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఓటీటీలో దీని విజయం సినిమా నిర్మాతలకు, నటీనటులకు ఒక గొప్ప గౌరవం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.