
📌 Key Points
- 2001లో ఆనందం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేఖా వేద వ్యాస్.
- ఆరోగ్య సమస్యల కారణంగానే పెళ్లి చేసుకోలేకపోయానని రేఖా వేద వ్యాస్ వెల్లడి.
- గతంలో పెళ్లిపై ఆసక్తి లేకపోయినా, తర్వాత మనసు మార్చుకున్నానని తెలిపిన రేఖా వేద వ్యాస్.
- తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించిన రేఖా వేద వ్యాస్.
టాలీవుడ్ ఆనందం హీరోయిన్ రేఖా వేద వ్యాస్ సంచలన విషయాలు వెల్లడించారు. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆనందం హీరోయిన్ రేఖా వేద వ్యాస్ షాకింగ్ కామెంట్స్!
సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ ఆ స్థాయిలో ఉండదు అనేది వాస్తవం. అందుకే హీరోయిన్స్ కూడా అవకాశాలు వస్తున్నప్పుడే వరుస పెట్టి సినిమాలు చేస్తారు. ఇక ఒక్కసారి నటీమణుల క్రేజ్ తగ్గితే సినిమా అవకాశాలు కూడా తగ్గుతాయి. అదే జరిగితే మెల్లిమెల్లిగా జనాలు కూడా వారిని మర్చిపోతారు. దానితో ఒకానొక సమయంలో మంచి దశలో కెరియర్ను కొనసాగించిన వారు కూడా ఖాళీగా ఉండిపోవాల్సి వస్తుంది. ఈ లిస్టులోకి ఆనందం బ్యూటీ రేఖా వేద వ్యాస్ చేరిపోయింది. 2001లో విడుదల అయిన ఆనందం సినిమా ద్వారా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
పెళ్లి చేసుకోకపోవడానికి అనారోగ్యమే కారణమా?
ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు మరియు కొన్ని సినిమాల్లో నటించింది. ఈమె కెరీర్లో తెలుగులో చాలా సినిమాల్లో నటించినా కొన్ని సినిమాల ద్వారానే మంచి విజయాలను దక్కించుకుంది. కానీ వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కావ్య తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. 2012 తర్వాత ఈమె ఏ తెలుగు సినిమాలో నటించలేదు.
సినిమాలకి దూరం కావడానికి అసలు కారణం ఇదేనా?
తాజాగా ఈమె ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన వ్యక్తిగత విషయాలను తెలియజేసింది. తాజాగా కావ్య మాట్లాడుతూ… కొంతకాలంగా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా నేను చాలా వీక్ గా ఉన్నాను. హెల్త్ బాగోలేకపోవడం వల్ల సినిమాలకు దూరం అయ్యాను. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నాకు పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి లేదు. ఆ తర్వాత మనసు మార్చుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నా కూడా నా అనారోగ్య సమస్యల వల్ల ఎవరూ కూడా నన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని రేఖా వేద వ్యాస్ తాజాగా తెలియజేసింది.
రేఖా వేద వ్యాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి. తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్ ని ఫాలో అవ్వండి.


