
బాలీవుడ్ నటి అనన్య పాండే తాజాగా బాడీ షేమింగ్ గురించి తన అనుభవాలను వెల్లడించింది. తన టీనేజ్‌లోను, మొదటి సినిమాలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Key Points
అనన్య పాండే బాడీ షేమింగ్ గురించి తన అనుభవాలను పంచుకుంది.
తన టీనేజ్‌లో తన రూపం గురించి విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
తన మొదటి సినిమాలో తన శరీరంతో ఇబ్బంది పడ్డానని వెల్లడించింది.
నా శరీరంతో నేను నిజంగా సంతోషంగా లేనని చెప్పింది.
అనన్య పాండే బాడీ షేమింగ్ అనుభవం
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే లైగర్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించి.. ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తర్వాత ఈ బ్యూటీ రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్‌ఎల్ వంటి తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి జనాల మెప్పు పొందింది. ఇకపోతే తాజాగా అనన్య పాండే ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
టీనేజ్‌లో ఎదుర్కొన్న విమర్శలు
3 నుంచి 10 సంవత్సరాల వరకు నేను పుట్టినరోజు పార్టీలలో నృత్యం చేయడానికి ఇష్టపడేదాన్ని అని వెల్లడించారు. కానీ నా టీనేజ్‌లో నా లుక్స్ గురించి పలువురు మాట్లాడటం వినడం ప్రారంభించానని తెలిపింది. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఈ అవమానాలు అదృశ్యం కాలేదని వెల్లడించింది. నా మొదటి చిత్రంలో నేను నిజంగా నా శరీరంతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ మూవీకి తగ్గట్లు నా బాడీ లేదని తెలిసిందని చెప్పింది. నా శరీరంతో నేను నిజంగా సంతోషంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
మొదటి సినిమా అనుభవం
A post shared by Bollywood Bubble (@bollywoodbubble)
అనన్య పాండే తన బాడీ షేమింగ్ అనుభవాన్ని పంచుకోవడం ద్వారా, ఈ సమస్య గురించి చర్చను ప్రారంభించింది. ఆమె ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.


