|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనసూయ భరద్వాజ్: ‘ఆ జాబ్‌ వెట్టి చాకిరితో సమానం.. అప్పటికే భాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌’

Published: 23-07-2025, 7:14 AM
అనసూయ భరద్వాజ్: 'ఆ జాబ్‌ వెట్టి చాకిరితో సమానం.. అప్పటికే భాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌'

యాంకర్‌గా ప్రారంభించి, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ భరద్వాజ్, తన వీఎఫ్‌ఎక్స్ అనుభవం, ప్రేమ జీవితం గురించి తన అభిమానులతో పంచుకుంది. ఆమె వివరించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

వీఎఫ్‌ఎక్స్ జాబ్ అనుభవం

యాంకర్ ‌ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు స్టార్ ‌ గా ఎదిగిన నటి అనసూయ . రంగస్థలంలో రంగమ్మత్తగా .. పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది . సినిమాలతో పాటు సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ ‌ గా ఉంటోన్న అనసూయ .. తాజాగా తన ఫ్యాన్స్ ‌ తో మీట్ ‌ ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా తన కెరీర్ ‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది .

సినిమా ప్రస్థానం

తాను ఓ వీఎఫ్ ‌ ఎక్స్ ‌ కంపెనీలో పనిచేశానని అనసూయ తెలిపింది . అక్కడంతా వెట్టిచాకిరి చేయాల్సిందేనని .. ఎనిమిది గంటల పాటు వర్క్ చేయాలనే రూమ్ ఏమి ఉండదని చెప్పింది . ఒక ప్రాజెక్ట్ ‌ తీసుకుంటే ఇచ్చిన టైమ్ ‌ లోనే ఫినిష్ చేయాలని అనసూయ వివరించింది . టైమ్ ‌ లోనే తనను సుకుమార్ , మెహర్ రమేశ్ , త్రివిక్రమ్ లాంటి వాళ్లు తనను చూశారని వెల్లడించింది . ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాకు మా టీమ్ వర్క్ చేసిందని .. అప్పుడు నేను కౌన్సిలర్ ‌ గా , హెచ్‌ఆర్‌ ఉన్నానని అనసూయ వివరించింది . హాలీవుడ్ ‌ తో పాటు తెలుగులో పలు సినిమాలకు వీఎఫ్ ‌ ఎక్స్ చేశామని తెలిపింది .

వ్యక్తిగత జీవితం

వీఎఫ్ ‌ ఎక్స్ ‌ లో కంపెనీలో పని చేసే సమయంలో తాను డేటింగ్ ‌ లో ఉన్నానని అనసూయ రివీల్ చేసింది . నా లైఫ్ ‌ లో ఒక్కరే బాయ్ ‌ ఫ్రెండ్ ‌ ఉన్నాడని .. అతన్నే పెళ్లి చేసుకున్నాని వెల్లడించింది . అంతేకాకుండా తనకు పవిత్ర ‍అనే పేరు మా అమ్మ పెట్టాలని అనుకుందని తెలిపింది. కానీ నాన్న వాళ్ల అమ్మగారి పేరు పెడదామని అనసూయ పెట్టేశారు. మా ముగ్గురికి అనసూయ, అంబిక, సాయి వైష్ణవి అని పెట్టారని గుర్తు చేసుకుంది.

అనసూయ తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి తెలిపిన విషయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తన విజయానికి కారణమైన కృషి, సంబంధాల గురించి ఆమె పంచుకున్న విషయాలు ప్రేరణదాయకంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.