
బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ తన వయసు, బంగారం రేటు పెరుగుదలపై చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో తాను నటించడం లేదని, అలాగే మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజయంపై సంతోషం వ్యక్తం చేసింది.
Key Points
అనసూయ భరద్వాజ్ తన వయసు తగ్గుతుంది, బంగారం రేటు పెరుగుతుందని వ్యాఖ్యానించింది.
ఆఫర్లు ఉన్నప్పుడే బంగారం వెనకేసుకోవాలని మహిళలకు సూచించింది.
ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో తాను నటించడం లేదని అనసూయ స్పష్టం చేసింది.
మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడంపై అనసూయ సంతోషం వ్యక్తం చేసింది.
అనసూయ హాట్ కామెంట్స్: వయసు, బంగారంపై
బుల్లితెర నుంచి వెండి తెరకు షిఫ్ట్ అయిన హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ తన అందచందాలతో నిత్యం సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటుంది. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. అంతేనా.. తనపై ఎవరైన అసభ్యకరంగా కామెంట్స్ చేస్తే వారిని ఉతికి ఆరేస్తుంది. తాజాగా ఈ రంగమ్మత్త ఆసక్తికర కామెంట్స్ చేసింది.
స్పిరిట్, పెద్ది సినిమాలపై అనసూయ క్లారిటీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మణిముఖుర జ్యువెలర్స్‌ను ప్రారంభోత్సవం అనంతరం అనసూయ మాట్లాడుతూ.. రోజురోజుకీ నా వయసు తగ్గుతుంది.. బంగారం రేటు పెరుగుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ఆఫర్లు ఉన్నప్పుడే బంగారం వెనకేసుకోవాలన్నారు. బంగారం అనేది మహిళలకి సౌందర్యంగా.., మగవారికి పొదుపు లాగా ఉంటుందన్నారు. బంగారం తక్కువ రేటు ఉన్నప్పుడే కొనుగోలు చేసి పొదుపు చేసుకోవాలని సూచించారు. మహిళలు క్రికెట్‌లో చరిత్ర సృష్టించి మొదటిసారి భారతదేశానికి వరల్డ్ కప్ తేవడంపై అనసూయ సంతోషంగా వ్యక్తం చేశారు. దేశానికి వరల్డ్ కప్పు రావడం ప్రతి మహిళకు గర్వకారణమన్నారు. విరోచిత పోరాటం చేసి దేశానికి వరల్డ్ కప్పు తెచ్చిన మహిళా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
మహిళా క్రికెట్ జట్టు విజయంపై అనసూయ ఆనందం
అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ప్రభాస్ స్పిరిట్ సినిమాలో తను నటించడం లేదని అనసూయ క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ సినిమాలో నేను నటిస్తున్నానని సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. పెద్ది సినిమాపై మాట్లాడుతూ మా బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తుండటంతో అంచనాలు మించిపోయాయన్నారు. పెద్ది సినిమాకి దర్శకత్వం వహిస్తున్న బుచ్చి మామయ్యకి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
అనసూయ వ్యాఖ్యలు కేవలం బంగారం, వయసుపైనే కాకుండా, సినీ ప్రాజెక్టులు, క్రీడా విజయాలపై ఆమె అభిప్రాయాలను వెల్లడించాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అనసూయ తాజా కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.


