
📌 Key Points
- శివాజీ వ్యాఖ్యలపై అనసూయ యూటర్న్, అదే సమయంలో పరోక్షంగా చురకలు అంటించింది.
- “అబ్బాయిలు అమ్మాయిలను వాళ్లకి నచ్చినట్టు ఉండనివ్వండి” అంటూ యువతకు కీలక సూచన చేసింది.
- “వామ్మో, దీని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్ అయిపోతా!” అంటూ బోల్డ్ రిప్లై ఇచ్చింది.
- అనసూయ భర్త నుండి పూర్తి స్వేచ్ఛ – “నీ ఇష్టం, నీ రిస్క్” అంటూ పూర్తి మద్దతు లభించింది.
టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అనసూయ! శివాజీ వ్యాఖ్యలపై ఆమె స్పందన, నెటిజన్ల ప్రశ్నలకు ఇచ్చిన షాకింగ్ సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో కౌంటర్‌లు ఇస్తూ, మరోసారి చర్చకు తెరలేపింది ఈ స్టార్ యాంకర్. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!
శివాజీపై అనసూయ పరోక్ష సెటైర్లు!
స్టార్ యాంకర్, నటి అనసూయ ఇటీవల వరుసగా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్ గురించి చేసిన కామెంట్లకి ఆమె రియాక్ట్ కావడంతో రచ్చ పెద్దగా అయ్యింది. అది పది రోజులుగా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి శివాజీ కామెంట్స్ పై స్పందించింది అనసూయ. అయితే ఇప్పుడు ఆమె కాస్త యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో ఆయనకు మరో విధంగా చురకలు అంటించింది.
తాజాగా అనసూయ అభిమానులతో సోషల్ మీడియాలో చాట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె మాట్లాడుతూ, శివాజీ వాడిన ఆ రెండు పదాలు గురించే కాదు, ఇలా చేయాల్సింది అని చెప్పింది. “శివాజీగారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు. కానీ పాత్రల ప్రభావం సినిమాల వరకు ఉంటే బాగుండేది. ఆయన మహిళల సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్దేశ్యం ఉంది. కానీ మగవాళ్లకి కూడా మరో విషయం చెప్పాల్సింది. `అరే అబ్బాయిలు అమ్మాయిలను వాళ్లకి నచ్చినట్టు ఉండనివ్వండి అని, అలాగే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మనం కూడా వారి నుంచి కాపాడుకోవాలి` అని చెబితే ఇంత రచ్చ అయ్యేది కాదు“ అని తెలిపింది.
“వామ్మో, మరో 10 రోజులు స్టఫ్!” – అసలు విషయం ఏంటి?
ఇంకా ఈ ఛాటింగ్‌లో అనసూయకి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ ఎనర్జీకి కారణం ఏంటని అడిగితే, నేను కారణజన్మురాలిని అనుకుంటున్నా అంటూ సరదాగా కామెంట్ చేసింది. ప్రతి దాంట్లో దూరి పరువు పోగొట్టుకుంటావ్ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఎవరి పరువు పోయింది. నా పరువు నా వద్దనే. వాళ్లే పరువు పోగొట్టుకుంటారు. నేను నెగటివిటీ ఏం కాలేదు. మీరు ఏదో లోకంలో ఉన్నట్టుంది` అని తెలిపింది అనసూయ.
అలాగే అమ్మాయిల డ్రెస్సుల గురించి ఇంతగా మాట్లాడుతున్నారు బాయ్స్. వాళ్లు బహిరంగంగా, రోడ్లపై మూత్రం పోస్తున్నారు, దానికేమనాలి అని ఓ నెటిజన్ అడగ్గా, వామ్మో దీనికే పది రోజులుగా నన్ను ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను దానికి రియాక్ట్ అయితే మరో పది రోజులు ఆడుకుంటారు. వాళ్లకు నేను స్టఫ్ అయిపోతాను అని తెలిపింది అనసూయ. అయితే తప్పు జరిగితే తాను స్పందిస్తానని, ఆ విషయంలో తాను వెనకడుగు వేయనని తెలిపింది.
అనసూయ భర్త సపోర్ట్ – ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టేనా?
మీపై ఇంత ట్రోల్ జరుగుతుంది. మీ భర్త రియాక్షన్ ఏంటి అని మరో నెటిజన్ అడగ్గా, `ఆయన నీ ఇష్టం, నీ రిస్క్ అని చెబుతారు. అలాంటి భర్త ఉండటం సంతోషం. ఆయన్ని ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలని నేను అనుకుంటున్నా` అని చెప్పింది స్టార్ యాంకర్. ఓ రకంగా అనసూయ భర్త ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఆమె చెప్పింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్ మీడియాలో అవుతున్నాయి.
అనసూయ, శివాజీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. తనదైన ధైర్యంతో అనసూయ ఇచ్చిన సమాధానాలు సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ వివాదంపై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


