|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)

Published: 02-08-2025, 2:46 AM
చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)

టాలీవుడ్ యాంకర్ అనసూయకు కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ‘చెప్పు తెగుద్ది’ అంటూ ఆమె హెచ్చరించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Key Points

1

అనసూయకు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారికి తీవ్రంగా హెచ్చరించారు.

2

చెప్పు తెగుద్ది అంటూ వారికి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు.

4

అనసూయకు మద్దతుగా చాలా మంది నిలిచారు.

అనసూయకు అసభ్యకర వ్యాఖ్యలు

టాలీవుడ్ న‌టి, యాంక‌ర్ అన‌సూయ ఫైర్ ‌ అయ్యారు . కొందరు ఆకతాయిలు చేసిన చిల్లర కామెంట్లకు చెప్పు తెగుద్ది అంటూ ఆమె బహిరంగంగానే వార్నింగ్ ‌ ఇచ్చారు . ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌ లోని ప్ర‌కాశం జిల్లా మార్క‌పూరంలోని ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌లో అనసూయ పాల్గొన్నారు . దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు చేరుకున్నారు . ఆమె మాట్లాడుతుండగా కొంద‌రు ఆక‌తాయిలు అనసూయకు వినిపించేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు . దీంతో ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది .

ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగుద్ది.. అంటూ గడ్డిపెట్టారు . మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబ‌స‌భ్యుల‌పై ఎవరైనా ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటారా. .? అంటూ ప్రశ్నించారు . పెద్ద‌వాళ్ల‌కి మ‌ర్యాద ఇవ్వ‌డం మీ ఇంట్లో నేర్పలేదా అంటూ ఆమె ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని , వారు చాలా హానికరమన్నారు . అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ ‌ అవుతుంది . అయితే, ఆ సమయంవలో అనసూయకు మద్ధతుగా చాలామంది నిలిచినట్లు తెలుస్తోంది.

తీవ్రంగా స్పందించిన అనసూయ

వైరల్ అవుతున్న వీడియో

అనసూయ ప్రతిస్పందన సమాజంలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను నిరోధించేందుకు ప్రేరేపించేదిగా ఉంది. మర్యాద, గౌరవం అనేవి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయాలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.