|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ మాటల వల్లే జబర్దస్త్ వదిలేశా, అమెరికా వెళ్లినా లింకులు పంపారు..హైపర్ ఆదికి అనసూయ డైరెక్ట్ వార్నింగ్

Published: 16-07-2025, 11:42 AM
ఈ మాటల వల్లే జబర్దస్త్ వదిలేశా, అమెరికా వెళ్లినా లింకులు పంపారు..హైపర్ ఆదికి అనసూయ డైరెక్ట్ వార్నింగ్

జబర్దస్త్ షో 12వ వార్షికోత్సవ వేడుకల్లో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన గొడవలు హైలైట్ అయ్యాయి. అనసూయ జబర్దస్త్ వదిలి వెళ్ళడానికి కారణం హైపర్ ఆది అని ఆమె వెల్లడించింది.

Key Points

1

అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన గొడవల వల్ల జబర్దస్త్ వదిలినట్లు అనసూయ వెల్లడించింది.

2

అమెరికాలో ఉన్నా హైపర్ ఆది తనతో సంబంధం ఉన్నట్లుగా మాట్లాడినట్లు అనసూయ ఆరోపించింది.

4

జబర్దస్త్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ వివాదం హైలైట్ అయ్యింది.

అనసూయ-హైపర్ ఆది మధ్య వివాదం

తెలుగులో అత్యంత పాపులర్ అయిన బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ టాప్ లో ఉంటుంది. జబర్దస్త్ షో వల్లే బలగం వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి టాలెంటెడ్ కమెడియన్లు పాపులర్ అయ్యారు. అదేవిధంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది లాంటి వాళ్లు కూడా మంచి గుర్తింపు పొందారు.

జబర్దస్త్ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి నాగబాబు అతిథిగా హాజరవుతున్నారు. చాలా ఏళ్లపాటు నాగబాబు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ షోకి అనసూయ కూడా హాజరు కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ మెగా సెలబ్రేషన్స్ ఎపిసోడ్ ఆగస్టు 1న ప్రసారం కాబోతోంది.

జబర్దస్త్ నుంచి అనసూయ ఎందుకు వెళ్లిపోయింది?

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అనసూయ హంగామా ఒక రేంజ్ లో ఉంది. జబర్దస్త్ అంటే గతంలో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు గుర్తుకొస్తుంది. ఈ ప్రోమోలో కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిలిపి గొడవనే హైలెట్ చేశారు. అనసూయ తనదైన శైలిలో గ్లామరస్ గా కనిపిస్తూ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. మరోసారి మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అనసూయ తెలిపింది.

మధ్యలో హైపర్ ఆది పరువు తీసేలా సెటైర్లు వేసింది. పొట్ట లోపలికి పెట్టుకో ఆది అంటూ అనసూయ సెటైర్ వేసింది. హైపర్ ఆది గురించి ఇంద్రజ మాట్లాడుతూ.. ఆది ఇప్పటివరకు ఒక మూలన కూర్చుని ఉన్నాడు. అనసూయ వచ్చాక ఆమెకి కనిపించాలని ముందుకు వచ్చి కూర్చున్నాడు అని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత హైపర్ ఆది, అనసూయ మధ్య చిలిపి గొడవలు జరిగాయి.

అమెరికా నుంచి లింకులు?

కానీ ఆ తర్వాత అనసూయ సడన్ గా సీరియస్ అయింది. జబర్దస్త్ నుంచి వెళ్లే ముందు నేను హైపర్ ఆదిని చాలా అడుక్కున్నాను.. వద్దు ఆది అని చాలా బ్రతిమాలాను. నాకు మొహమాటం లేదు మైక్ లోనే చెప్పేస్తా. హైపర్ ఆదితోపాటు నేను కూడా స్కిట్ చేశాను. ఎంతో ఎంకరేజ్ చేశాను. కానీ నాకు ప్రాధాన్యత దక్కలేదు అంటూ అనసూయ హైపర్ ఆదిపై ఫైర్ అయింది.

అనసూయ గురించి హైపర్ ఆది పరోక్షంగా కామెంట్స్ చేస్తూ.. అమెరికాకు పోయినా మనకి లింకులు పంపించారు.. అదిరా మన లింకు అంటూ కామెంట్స్ చేశాడు. ఇదిగో ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయా అంటూ అనసూయ ఘాటుగా కామెంట్స్ చేసింది. అంతలా వీరి మధ్య ఎందుకు వివాదం చెలరేగింది అనేది ఈ షో టెలికాస్ట్ అయిన తర్వాతే తేలనుంది.

అనసూయ, హైపర్ ఆది మధ్య వివాదం జబర్దస్త్ షోకు సంచలనం సృష్టించింది. అనసూయ చేసిన ఆరోపణలు, హైపర్ ఆది ప్రతిస్పందన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.