|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టాలీవుడ్‌లో రష్మి గౌతమ్‌కు అవమానం? సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్‌!

Published: 10-01-2026, 9:00 AM
షాకింగ్: టాలీవుడ్‌లో రష్మి గౌతమ్‌కు అవమానం? సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్‌!
  • యాంకర్‌ రష్మి సంచలన వ్యాఖ్యలు: సినిమాల్లో సవతి తల్లిలా చూశారని ఆవేదన!
  • గుంటూరు టాకీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నా, చెల్లి పాత్రలకే పరిమితం చేశారని బాధ!
  • చిరంజీవితో కలిసి భోళా శంకర్‌లో స్టెప్పులేసిన రష్మి గౌతమ్‌!
  • జబర్దస్త్‌ కామెడీ షోతో 13 ఏళ్లుగా బుల్లితెర రాణిగా రష్మి కెరీర్!

యాంకర్ రష్మి గౌతమ్ టాలీవుడ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని సవతి తల్లిలా చూశారని, అందుకే సినిమాలపై విరక్తి కలిగిందని కుండబద్దలు కొట్టింది. ఈ షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రష్మి కెరీర్ లో సంచలన మార్పులు!

రష్మి గౌతమ్‌ బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమెకి `జబర్దస్త్` కామెడీ షో లైఫ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 13ఏళ్లుగా ఈ షోకి యాంకర్‌గా చేస్తుంది రష్మి. ఒక షో ఇన్నేళ్లు రన్‌ కావడం ఓ విశేషమైతే, దానికి యాంకర్‌ కూడా ఒక్కరే కొనసాగడం విశేషం. కొంత కాలం అనసూయ కూడా యాంకరింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆమె రెండేళ్ల క్రితమే దీన్నుంచి తప్పుకుంది. దీంతో రష్మి గౌతమ్‌ ఇప్పుడు సింగిల్‌గా రెండు ఎపిసోడ్లని రన్‌ చేస్తోంది.

యాంకర్‌ రష్మి హీరోయిన్‌ కావాలని సినిమాల్లోకి వచ్చింది. ప్రారంభంలో ఆమె కొన్ని సినిమాలు చేసింది. సీరియల్స్ కూడా చేసింది. కానీ క్యారెక్టర్స్, చెల్లి పాత్రలు చేసింది. నటిగా `హోలీ`, `కరెంట్‌`, `ఎవరైనా ఎపుడైనా`, `గణేష్‌`, `బిందాస్‌`, `ప్రస్థానం`, `గురు`, `గుంటూరు టాకీస్‌`, `అంతం` వంటి చిత్రాల్లో నటించింది. అయితే గుంటూరు టాకీస్‌ రష్మికి మంచి బ్రేక్‌ ఇచ్చింది. `అంతం`లో హీరోయిన్‌గానే చేసింది. `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` మూవీలోనూ హీరోయిన్‌గా చేసింది.

సవతి తల్లిలా చూశారని ఆవేదన!

అయితే ప్రారంభంలో రష్మి క్యారెక్టర్స్ చేయడం వల్ల తాను ఫేస్‌ చేసిన స్ట్రగుల్స్ ని చెప్పింది. చెల్లి పాత్రలు చేయడంతో అంతా చెల్లి పాత్రలకే అడిగారని, చెల్లిగానే గుర్తిస్తున్నారని తెలిపింది. తాను చేసిన పాత్ర పేరు కూడా వాళ్లకి గుర్తుండదు, ఫలానా సినిమాలో చెల్లిగా చేశారు, ఫ్రెండ్‌గా చేశారు, ఈ పాత్ర చేశారు అంటుంటారు, తప్పితే కనీసం పేరు కూడా గుర్తుండదు అని వెల్లడించింది. సెట్‌లో హీరోలు, హీరోయిన్లకి ట్రీట్‌ మెంట్‌ వేరేలా ఉంటుంది. మాలాంటి ఇతర పాత్రలు చేసేవారికి మరోలా ట్రీట్‌ చేస్తుంటారని వాపోయింది.

ఒక రకంతా తాను సవతితల్లి ట్రీట్‌ మెంట్‌ని ఫేస్‌ చేసినట్టు తెలిపింది. అది చూసి చూసి విసిగిపోయి, విరక్తి చెందినట్టు వెల్లడించింది రష్మి. అందుకే అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదని తెలిపింది. ఒక్కసారి చెల్లి పాత్రలు చేస్తే అన్నీ చెల్లి పాత్రలే వస్తాయని, అవే చేస్తారనే ముద్ర వేస్తారని చెప్పింది రష్మి. అందుకే తాను సినిమాలకు దూరమయినట్టు పేర్కొంది.  ఈ మధ్య రష్మి సినిమాలు చేయడం లేదు. కేవలం జబర్దస్త్ కామెడీ షోకే పరిమితమయ్యింది.

భోళా శంకర్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులు!

చివరగా ఆమె `భోళా శంకర్‌` చిత్రంలో ఓ పాటలో మెరిసింది. ఇందులో చిరంజీవితో కలిసి ఆమె డాన్స్ వేయడం విశేషం. స్పెషల్‌గా ఉండే ఈ పాటలో మెగాస్టార్‌తో స్టెప్పులేసి మెప్పించింది రష్మి. ఇక రష్మి ప్రారంభంలో సీరియల్స్ కూడా చేసింది. `యువ` అనే సీరియల్‌లో ఆమె మెరిసింది. ఇందులో రాజమౌళి కి  లవర్‌గా కనిపించడం విశేషం. అలాగే `లవ్‌` అనే మరో సీరియల్‌లో కూడా నటించింది. ఆ తర్వాత షోస్‌ వైపు టర్న్ తీసుకుంది. `జబర్దస్త్` షోతోపాటు `ఢీ`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోస్‌ చేసింది. ఇప్పుడు `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోస్‌కే పరిమితమయ్యింది.

రష్మి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.