
యాంకర్ రవి ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఒక బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఒక సాంగ్ షూట్ సమయంలో ఆయనకు ఒక వ్యక్తి నుండి అనుచితమైన ప్రవర్తన ఎదురైంది. ఈ సంఘటన వివరాలు చూద్దాం.
Key Points
యాంకర్ రవి ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడాడు.
ఒక సాంగ్ షూట్ సమయంలో ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది.
ఒక వ్యక్తి రవిని గుర్తుపట్టి, అతని తొడ మీద చేయి వేశాడు.
రవి గట్టిగా ప్రతిస్పందించడంతో ఆ వ్యక్తి సైలెంట్ అయ్యాడు.
యాంకర్ రవి యూట్యూబ్ ఇంటర్వ్యూ
Anchor Ravi : యాంకర్ గా రవి అనేక షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో కూడా నటించాడు. ఇటీవల బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో యూట్యూబ్ వీడియోలతో, బయట ఈవెంట్స్ తో బిజీగానే ఉన్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో రవి ఒక గే వల్ల తనకు ఎదురైన అనుభవం చెప్పుకొచ్చాడు.
ఆర్టీసీ బస్సులో జరిగిన ఘటన
రవి ప్రతిస్పందన
యాంకర్ రవి మాట్లాడుతూ.. ఒక సాంగ్ షూట్ ఆర్టీసీ బస్సు లో షూట్ చేస్తున్నాము. అక్కడ షూట్ చేస్తునట్టు ఎవరికీ తెలీదు. సైలెంట్ గా కెమేరా పెట్టి చేస్తున్నాము. నేను మాములుగా కూర్చొని ల్యాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకోవాలి. బస్ లో వేరే వాళ్లు కూడా ఉన్నారు. ఒకతను ఎక్కి నా పక్కన కూర్చొని మీరు రవి కదా అని మాట్లాడాడు. నేను క్యాజువల్ గా బాగానే మాట్లాడాను. కాసేపు అయ్యాక మెల్లిగా చెయ్యి నా తొడ మీద వేసి ఏదో చేయబోయాడు. నేను అడిగేసరికి అతని ఒరిజినల్ బయటపడింది. నా మీద చేతులేసి ఏదేదో మాట్లాడసాగాడు. ఏం చేస్తున్నావు రా అయ్యా నేను అలాంటోన్ని కాదు అన్నా. నేను గట్టిగా అడిగేసరికి సైలెంట్ అయిపోయాడు అని తెలిపాడు.
చివరకు, యాంకర్ రవి తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఇటువంటి ఘటనల గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేశాడు. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న వారికి మద్దతు అందించడం చాలా ముఖ్యం.

