|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణుప్రియతో పెళ్లిపై పృథ్వీ షాకింగ్ కామెంట్స్! అసలేం జరిగిందో తెలుసా? వైరల్ న్యూస్!

Published: 12-01-2026, 11:00 AM
విష్ణుప్రియతో పెళ్లిపై పృథ్వీ షాకింగ్ కామెంట్స్! అసలేం జరిగిందో తెలుసా? వైరల్ న్యూస్!
  • విష్ణుప్రియతో పెళ్లి గురించి పృథ్వీ శెట్టి సంచలన వ్యాఖ్యలు! అభిమానుల్లో తీవ్ర చర్చ!!
  • క్లోజ్ ఫ్రెండ్ మాత్రమేనని, పెళ్లికి విష్ణుప్రియకు పృథ్వీ నో చెప్పడం హాట్ టాపిక్!
  • విష్ణుప్రియకు వయసు మీద పడిందని, మంచి వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకోమని పృథ్వీ సలహా!
  • పృథ్వీ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.. ఇంత మంచి అమ్మాయిని వదులుకుంటావా బ్రో అంటూ ట్రోల్స్!

యాంకర్ విష్ణుప్రియ, పృథ్వీ శెట్టిల మధ్య పెళ్లి వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పృథ్వీ శెట్టి ఈ విషయంపై స్పందించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి.

విష్ణుప్రియతో పృథ్వీ బంధంపై క్లారిటీ!

Prithviraj shetty : యాంకర్ గా ఫేమ్ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో మరింత వైరల్ అయింది విష్ణుప్రియ. ఇప్పుడు టీవీ షోలు, అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. విష్ణుప్రియ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు సీరియల్ నటుడు పృథ్వీ రాజ్ శెట్టికి బాగా దగ్గరైంది.(Prithviraj shetty)

బిగ్ బాస్ లో వీళ్ళిద్దరూ లవర్స్ లాగే ప్రవర్తించారు కొన్నిసార్లు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా వీరి బంధం కొనసాగింది. విష్ణుప్రియ గతంలో లవ్ బ్రేకప్స్ చూసాను అని, ఇపుడు పృథ్వీ అంటే ఇష్టం అని అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

పెళ్లి గురించి అడిగితే షాకింగ్ రిప్లై!

ప్రస్తుతానికి ఇద్దరం మంచి ఫ్రెండ్స్, అవకాశం ఉంటే పృథ్వీని పెళ్లి చేసుకుంటాను ఏమవుతుందో భవిష్యత్తులో చూడాలి అని విష్ణు చెప్పుకొచ్చింది. పృథ్వీ తల్లి కూడా విష్ణుప్రియ ఓకే అన్నట్టు హింట్ ఇచ్చింది. తాజాగా పృథ్వీశెట్టి విష్ణుప్రియతో పెళ్లిపై స్పందించాడు.

పృథ్వీశెట్టి తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా విష్ణుప్రియతో ఉన్న అనుబంధం ఏంటి, తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్.. వైరల్!

దీనికి పృథ్వీశెట్టి సమాధానమిస్తూ.. తను నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ ఇండస్ట్రీలో తనే బెస్ట్ ఫ్రెండ్. పెళ్లి గురించి అడుగుతుంది కానీ నేను వద్దు అంటాను. నువ్వు ఎవర్ని అయినా మంచోడిని చూసుకొని పెళ్లి చేసుకో బాగుంటావు, నేను వద్దు అన్నాను. పెళ్లి ఎందుకు ఇప్పుడే అని చెప్తాను. కానీ ఆమెకు టైం లేదు ఆమెకు వయసు అయింది. అందుకే వేరే వాళ్ళను చేసుకోమన్నాను అని తెలిపాడు.

ఇదే ఇంటర్వ్యూలో పృథ్వీ విష్ణుప్రియకి కాల్ చేస్తే కాల్ లో కూడా విష్ణు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సరదాగా. విష్ణుప్రియ ఇలా ఇప్పటికే పలుమార్లు పృథ్వీపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టిన పృథ్వీ పెళ్ళికి నో చెప్పడంతో అంత అందమైన అమ్మాయి వస్తే నో చెప్తావేంటి బ్రో అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పృథ్వీ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.