|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీరు హీరోలా ఉండరన్న యాంకర్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన ప్రదీప్ రంగనాథన్

Published: 09-10-2025, 11:49 PM
మీరు హీరోలా ఉండరన్న యాంకర్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవల ట్రైలర్ లాంచ్‌లో ఓ యాంకర్ “మీరు హీరోలా ఉండరు” అని చేసిన వ్యాఖ్యలకు ప్రదీప్ తనదైన శైలిలో ధీటైన సమాధానమిచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల.

2

ట్రైలర్ లాంచ్‌లో యాంకర్ "మీరు హీరోలా ఉండరు, లక్ వల్లే సక్సెస్" అని వ్యాఖ్యానించింది.

4

ప్రేక్షకులు తమని తాము హీరోలుగా భావిస్తున్నప్పుడు తాను ఆల్రెడీ హీరోనే అని ప్రదీప్ సమాధానం.

ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ వివరాలు

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)ఓ వైపు పలు చిత్రాలు తెరకెక్కిస్తూనే.. మరో వైపు వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇటీవల ‘డ్రాగన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. మమితా బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటించిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘డ్యూడ్’ (dude)ట్రైలర్ లాంచ్ చేయగా.. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది.

యాంకర్ ఊహించని ప్రశ్న: మీరు హీరోలా ఉండరు!

మీరు హీరోలానే ఉండరు.. రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ లక్ వల్లే అనేసింది. దీంతో ఈ విషయంపై ప్రదీప్ రంగనాథన్ స్పందిస్తూ.. ‘‘బయట చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నేను వాళ్ళందరిని చూశాను. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం మొదటిది హార్డ్ వర్క్,, రెండోది లక్. వీటన్నిటిని మించి చాలామంది వాళ్లను నాలో చూసుకుంటున్నారు.

నా విజయం ప్రేక్షకులదే: ప్రదీప్ రంగనాథన్

వాళ్లు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళే మేము హీరోలం అని ఫీల్ అవుతున్నారు. మేమే యాక్టింగ్, ఫైటింగ్, రొమాన్స్ చేస్తున్నాం అని నా సినిమాలు చూసి వాళ్ళు ఫీలవుతున్నారు. వాళ్లు చూసుకుంటున్నప్పుడు నేను ఆల్రేడీ హీరోనే’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా దిమ్మతిరికే సమాధానం ఇచ్చావంటూ ప్రదీప్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

ప్రదీప్ రంగనాథన్ ఇచ్చిన ఈ దిమ్మతిరికే సమాధానంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన నిజమైన విజయం ప్రేక్షకుల అభిమానమే అని చెప్పడం ద్వారా ప్రదీప్ అందరి మన్ననలు పొందుతున్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.