
📌 Key Points
- యాంకర్ స్రవంతి మొదటి సినిమా 2013లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘మహంకాళి’.
- మొదటి సినిమా షూటింగ్ లో జర్నలిస్ట్ పాత్రలో 12 రోజులు పనిచేసిన స్రవంతి.
- 2010 లోనే రోజుకు రూ.3000 పారితోషికం అందుకున్న స్రవంతి.. ఆ డబ్బుతో తల్లికి పట్టుచీర.
- ఫిబ్రవరి 20న విడుదల కానున్న ‘హే బలవంత్’ సినిమాలో కీలక పాత్రలో స్రవంతి.
బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ స్రవంతి గురించి ఒక సంచలన వార్త! స్రవంతి ఒకప్పుడు హీరోయిన్ కూడా అని మీకు తెలుసా? ఆమె మొదటి సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
స్రవంతి మొదటి సినిమా ఏంటో తెలుసా?
Anchor Sravanthi : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న యాంకర్ స్రవంతి ఇప్పుడు సినిమా ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. ఇప్పుడు స్రవంతి యాంకర్ నుంచి నటిగా మారి వరుస సినిమాలు చేస్తుంది.(Anchor Sravanthi)
స్రవంతి కీలక పాత్రలో నటించిన హే బలవంత్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్రవంతి తన మొదటి సినిమా గురించి తెలిపింది. అందరికి స్రవంతి గత కొన్నేళ్లుగా యాంకర్ గానే తెలుసు. కానీ గతంలో నటిగా కూడా సినిమాలు చేసింది.
జర్నలిస్ట్ పాత్రలో స్రవంతి అదరగొట్టింది!
యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. ఇంట్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళ పర్మిషన్ తోనే ఇక్కడ దిల్‌షుక్ నగర్ లో హాస్టల్ లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంటున్నా. నా హాస్టల్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి షూటింగ్ లో తెలిసినవాళ్ళు ఉన్నారని రాజశేఖర్ మహంకాళి సినిమా షూటింగ్ కి తీసుకెళ్లింది. నేను ఊరికే హీరోతో ఫోటో దిగి వచ్చేద్దాం అనుకోని బాగా రెడీ అయి వెళ్ళా. ఆ రోజు షూట్ లో ఒక అమ్మాయి రాలేదు. నన్ను చూసి ఆ అమ్మాయి ప్లేస్ లో యాక్టింగ్ చేస్తావా అని అడగటంతో మనం అందుకేగా వచ్చింది అని ఓకే చెప్పా.
ఆల్మోస్ట్ 12 రోజులు ఆ సినిమాకు పనిచేశా. అందులో జర్నలిస్ట్ క్యారెక్టర్ లో సినిమా అంతా అక్కడక్కడా కనిపిస్తా. డైలీ 3000 ఇచ్చేవాళ్ళు 2010 లోనే. అప్పుడు నాకు కెమెరా ఫేసింగ్, మేకప్.. ఇవేమి తెలీదు. డైలీ డబ్బులు, ఫుడ్ ఉంది కదా బాగుంది అనుకోని చేశా. ఆ డబ్బులతో మా అమ్మకు పట్టుచీర కొనిచ్చా అని తెలిపింది. మహంకాళి సినిమా 2013 లో రిలీజయింది. ఆ సినిమాలో స్రవంతి అక్కడక్కడా పలు సీన్స్ లో కనిపిస్తుంది.
మళ్ళీ హీరోయిన్ గా స్రవంతి రీఎంట్రీ!
అలా అప్పట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన స్రవంతి పెళ్లి తర్వాత సినిమాలు మానేసిందని తెలిపింది.
స్రవంతి కెరీర్ ఇప్పుడు ఊపందుకుంది. ఆమె మరిన్ని సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి.


