|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సారీ సర్‌.. అంటూనే హీరోయిన్‌ కోసం మంత్రి స్పీచ్‌ ఆపేసిన యాంకర్‌

Published: 11-06-2025, 6:04 AM
సారీ సర్‌.. అంటూనే హీరోయిన్‌ కోసం మంత్రి స్పీచ్‌ ఆపేసిన యాంకర్‌

తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్ బాబు ప్రసంగం మధ్యలోనే యాంకర్ ఝాన్సీ అడ్డుకుని హీరోయిన్ శ్రీలీలను వేదికపైకి పిలిచింది. ‘షి ఈజ్ ది హీరో ఆల్వేస్’ యాప్ లాంచ్ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

తెలంగాణ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్ బాబు ప్రసంగం మధ్యలో యాంకర్ ఝాన్సీ అడ్డుకుంది.

2

హీరోయిన్ శ్రీలీలను వేదికపైకి ఆహ్వానించడానికి ప్రసంగం ఆపబడింది.

4

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

మంత్రి ప్రసంగం మధ్యలో అడ్డుకున్న యాంకర్

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్‌బాబు ( Duddilla Sridhar Babu )కు చేదు అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌ – SITHA) యాప్‌ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తుండగా యాంకర్‌ ఝాన్సీ ( Anchor Jhansi ) మధ్యలోనే అడ్డుకుంది. దీంతో కొన్ని క్షణాలపాటు మంత్రికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీత యాప్‌ లాంఛ్‌కు అతిథిగా విచ్చేసిన శ్రీలీల కోసం తన ప్రసంగాన్ని ఆపారని అర్థమై ఆయన సైలెంట్‌గా పోడియం నుంచి వెనక్కు జరిగారు.

మంత్రి ప్రసంగానికి ఆటంకం అప్పుడు మైక్‌ అందుకున్న ఝాన్సీ.. మంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్‌ శ్రీలీల ( Actress Sreeleela )ను స్టేజీపైకి పిలిచింది. ‘షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌’ అనే యాప్‌ లాంఛ్‌ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు.

హీరోయిన్ శ్రీలీల కోసం ప్రసంగం ఆగిపోవడం

సభామర్యాద పాటించరా? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల హీరోయిన్‌ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్‌ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్‌బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

మంత్రి ప్రసంగం ఆగిపోవడంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభా మర్యాద, యాంకర్ ప్రవర్తనపై చర్చ జరుగుతోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.