
స్టార్ యాంకర్ సుమ కనకాల తెలుగు ప్రేక్షకులను తన యాంకరింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె అమెరికాలో ఒక రికార్డు సృష్టించినట్లు బయటపడింది. అప్పట్లోనే, 1997లో, అమెరికాలో షూటింగ్ జరిగిన తొలి తెలుగు సీరియల్‌లో సుమ నటించారు.
Key Points
సుమ కనకాల టీవీ సీరియల్స్ ద్వారా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, పలు రికార్డులు సృష్టించారు.
1997లో అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సీరియల్ 'గీతాంజలి'లో సుమ నటించారు.
ఆ సీరియల్ షూటింగ్ సమయంలో సుమ మేకప్, అసిస్టెంట్ డైరెక్టర్ వంటి పలు బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం 13 ఎపిసోడ్ల 'గీతాంజలి' సీరియల్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
సుమ కనకాల: కెరీర్ ప్రస్థానం, టీవీ ఎంట్రీ
Suma Kanakala : సుమ కనకాల తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. పలు టీవీ షోలతో తెలుగు వారి ఇళ్లలో ఒకరిగా నిలిచింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా స్టార్ యాంకర్ గా అదే ఎనర్జీతో కొనసాగుతుంది సుమ. అయితే సుమ మొదట టీవీ సీరియల్స్ నుంచే పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే.(Suma Kanakala)
తాజాగా సుమ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో సుమ అమెరికాలో ఓ సీరియల్ చేశాను అని చెప్పింది.
అమెరికాలో తొలి తెలుగు సీరియల్ ‘గీతాంజలి’ వివరాలు
సుమ మాట్లాడుతూ.. ఒక సీరియల్ షూటింగ్ అమెరికాలో జరిగింది. ఆ సీరియల్ పేరు గీతాంజలి. అమెరికాలో ఫస్ట్ సీరియల్ షూటింగ్ జరిగింది మాదే. 1997లో ఈ సీరియల్ షూటింగ్ జరిగింది. ఒక సింగిల్ కెమెరా పట్టుకొని మా అమ్మ, నేను, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ అయిదుగురు మాత్రమే ఇక్కడ్నుంచి వెళ్ళాము. సీరియల్ లో నటించిన వాళ్లంతా అక్కడ ఉన్న తెలుగువాళ్లే. మా వంటలు మేమే వండుకున్నాము, నేనే అందరికి మేకప్ వేసాను. లైటింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే ఆ సీరియల్ కి అని తెలిపింది.
యాంకరింగ్ తో పాటు అరుదైన రికార్డు సొంతం
ఇప్పటికే యాంకరింగ్ లో, టీవీలో అనేక రికార్డులు సెట్ చేసింది యాంకర్ సుమ. ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ షూటింగ్ చేసిన తెలుసుగు సీరియల్ అనే రికార్డ్ కూడా తన పేరు మీదే ఉందని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ సీరియల్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. సుమ గీతాంజలి సీరియల్ అని సెర్చ్ చేస్తే 13 ఎపిసోడ్స్ సీరియల్ అందుబాటులో ఉంది.
యాంకర్ గానే కాకుండా, అమెరికాలో తొలి తెలుగు సీరియల్‌కు ఆమె చేసిన కృషి సుమ కనకాల బహుముఖ ప్రజ్ఞను చాటుతుంది. ఈ అరుదైన రికార్డు ఆమె అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది.


