|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సుమ భర్త కాదు.. వదిలేసిన భర్త అనకుండా చూసుకో! రాజీవ్ కనకాలకు రాజా రవీంద్ర కౌంటర్!

Published: 20-03-2026, 11:15 AM
షాకింగ్: సుమ భర్త కాదు.. వదిలేసిన భర్త అనకుండా చూసుకో! రాజీవ్ కనకాలకు రాజా రవీంద్ర కౌంటర్!
  • రాజీవ్ కనకాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రాజా రవీంద్ర!
  • సుమతో విడిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజీవ్ క్లారిటీ
  • గతంలో సుమ, రాజీవ్ విడివిడిగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకున్న రాజీవ్.
  • సుమ గారి భర్త అని పిలిస్తే కోపం వస్తుందన్న రాజీవ్ కనకాల!

టాలీవుడ్ లో హాట్ టాపిక్! యాంకర్ సుమ మరియు రాజీవ్ కనకాల గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రాజా రవీంద్ర చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

సుమ గారి భర్త అంటే కోపం వస్తుందన్న రాజీవ్!

సుమ తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందే రాజీవ్ కనకాల ఫ్యామిలీ టాలీవుడ్లో తనకంటూ గుర్తింపును పొందింది. రాజీవ్‌ను పెళ్లి చేసుకున్నాక సుమకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే సుమ సొంతంగా పేరు ప్రతిష్టలతో పాటు విపరీతంగా ఆస్తులను సంపాదించింది. యాంకర్ సుమ అంటే చాలు ఎంతోమందికి విపరీతమైన ఇష్టం. ఆమె షో చేసిందంటే అందులో నవ్వులు పువ్వులు పూయాల్సిందే. సోషల్ మీడియాలోనూ సుమకు ఫాలోయింగ్ ఎక్కువే. ఇక ఆమె భర్త రాజీవ్ కనకాల మంచి నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే గత 20 ఏళ్లుగా యాంకర్ సుమ అందుకున్న విజయాన్ని మాత్రం ఆయన అందుకోలేకపోయారు.

రాజీవ్ కు రాజా రవీంద్ర అదిరిపోయే కౌంటర్!

చాలామంది తనను సుమగారి భర్తగా గుర్తించడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు రాజీవ్ కనకాల. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సుమ గారి భర్త అంటే తనకు మండుతోందని అన్నారు. ‘ఆ మధ్యన ఒక షూటింగ్లో ఉన్నప్పుడు ఒక ముసలావిడ వచ్చి పలకరించింది. రాజీవ్ గారు బాగున్నారా అంది. నేను బాగున్నానని చెప్పాను. ఈలోపు వెనకనుంచి ఆమె భర్త కూడా వచ్చి ఎవరు? అని అడుగుతున్నారు. ఆమె రాజీవ్ కనకాల అని చెప్పినా ఆయనకు వినిపించలేదు. దాంతో ఈమె సుమ గారి భర్త అని చెప్పింది. అది వినగానే నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఈలోపు అక్కడ రాజా రవీంద్ర కూడా ఉన్నారు. అతనితో నేను ఈ ఏడాది ఆ పేరు నేను మార్చుకుంటాను.. రాజీవ్ కనకాలగానే పిలిపించుకుంటాను అని అన్నాను. దానికి రాజా రవీంద్ర సుమ గారి భర్త అన్నా ఫర్వాలేదు. సుమ వదిలేసిన భర్త అనిపించుకోకుండా చూసుకో’ అని జోకులేసాడు.

సుమ, రాజీవ్ విడాకులపై క్లారిటీ!

వ్యక్తిగతంగా సుమ, రాజీవ్ ప్రస్తుతం సంతోషంగానే ఉన్నారు. కొన్ని నెలల క్రితం మాత్రం వారి వ్యక్తిగత జీవితంలో దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. సుమ కూడా తన భర్త గురించి వారి రిలేషన్షిప్ లో వచ్చిన ఇబ్బందుల గురించి రాజీవ్ పడిన ఇబ్బందుల గురించి కూడా కొన్నిసార్లు బహిరంగంగానే మాట్లాడారు. ఒకసారి మాత్రం సుమతో విడిగా ఉండాల్సిన రోజులు వచ్చాయని రాజీవ్ వివరించారు. తన తల్లి చనిపోయిన తర్వాత తండ్రి దేవదాసు కనకాల ఒక్కరే మణికొండలోని ఇంట్లో ఉండే వారని, అప్పుడు సుమతో కలిసి పిల్లలతో నేను వేరే చోట ఉండే వాళ్ళమని చెప్పాడు రాజీవ్. నాన్నకు తోడుగా ఉండేందుకు కొన్నాళ్లు తాను మణికొండలోనే ఉన్నానని, అప్పుడు సుమ నేను విడిగా ఉండాల్సి వచ్చిందని వివరించారు. కొన్ని రోజులు దూరంగా ఉండటంతో తమ విడిపోయాయని కొందరు రాసేసారని.. అంతే కానీ తాము ఎప్పుడు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సుమ, రాజీవ్ సంతోషంగా ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.