
📌 Key Points
- `ఆంధ్ర కింగ్ తాలూకా` 6 రోజుల్లో ఇండియాలో రూ.17 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది.
- ప్రపంచవ్యాప్తంగా రూ.23 కోట్లు వసూలు, బ్రేక్ ఈవెన్‌కు రూ.55 కోట్లకుపైగా గ్రాస్ అవసరం.
- శుక్రవారం నుంచి `అఖండ 2` వస్తుండటంతో `ఆంధ్ర కింగ్ తాలూకా`కు థియేటర్లు ఉండవు.
- రామ్ పోతినేని కెరీర్‌లో ఇది మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.
రామ్ పోతినేని నటించిన `ఆంధ్ర కింగ్ తాలూకా` సినిమా విడుదలైన 6 రోజుల్లోనే షాకింగ్ కలెక్షన్లతో నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగా మారింది.
6 రోజుల బాక్సాఫీసు వసూళ్లు: సినిమా పరిస్థితి
రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆంధ్ర కింగ్ తాలూకా`. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. ఆయన ఇందులో సినిమా హీరోగా నటించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రం గత గురువారం(నవంబర్ 27న) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన రాబట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ మూవీకి ఫస్ట్ డే నుంచే మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు విడుదలై ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. రోజుకి కోటి, కోటిన్నర మధ్యనే బాక్సాఫీసు వసూళ్లు ఆగిపోయాయి. ఆరు రోజుల్లో ఇది ఇండియాలో కేవలం రూ.17కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.23కోట్ల వరకు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ లెక్కన ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కి చాలా దూరంలో ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి సుమారు రూ.55కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రావాలి. కానీ ఇప్పుడు సగం మాత్రమే వచ్చాయి.
రామ్ పోతినేని ఆశలు.. వాస్తవం
`ఆంధ్ర కింగ్ తాలూకా` మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.27కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్‌ని చేరుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి ఉన్నది ఇంకా రెండు రోజులే. బుధవారం, గురువారం మాత్రమే ఈ సినిమాకి ఛాన్స్ ఉంది. శుక్రవారం నుంచి `అఖండ 2` వస్తోంది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో ఆ సినిమానే ప్రదర్శిస్తారు. దీంతో `ఆంధ్ర కింగ్ తాలూకా`ని ఎత్తేస్తారు. ఆ తర్వాత ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. ఈ లెక్కన రామ్ కెరీర్‌లో ఇది మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.
రామ్ చివరగా `ఇస్మార్ట్ శంకర్`తో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేశాయి. కానీ `ఆంధ్ర కింగ్ తాలూకా` మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఇది కూడా డిజప్పాయింట్ చేయడం బాధాకరం. అయితే సినిమా పట్ల రామ్ చాలా నమ్మకంతో ఉన్నారు. మంగళవారం ప్రెస్ మీట్‌లో కూడా ఆయన తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పది మంది సినిమా చూస్తే 9 మందికి నచ్చింది. కానీ ఆ పది మందే చూశారు, ఇంకా పెరగాల్సి ఉందన్నారు. క్రమంగా ఈ చిత్రం పుంజుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? తదుపరి అడుగు
ఇక ఈ సినిమా స్టోరీ ఏంటనేది చూస్తే, ఇందులో ఇందులో ఉపేంద్ర స్టార్ హీరోగా నటించారు. ఆయనకు అభిమానిగా రామ్ కనిపిస్తాడు. అభిమాన హీరో వందవ సినిమా ఆగిపోతుంది. అందుకు మూడు కోట్లు కావాల్సి ఉంది. ఆ మనీ కోసం నిర్మాతలను రిక్వెస్ట్ ఉపేంద్ర. తన కొడుకు సినిమాలో క్యారెక్టర్ చేయమని అడుగుతాడు ఓ నిర్మాత. ఇది విని షాక్ తిన్న రామ్.. తన థియేటర్ అమ్మి ఉపేంద్రకి మూడు కోట్లు డబ్బు పంపించడమే సినిమా. అయితే ఆ థియేటర్ కథేంటి? దాని వెనుక ఉన్న లవ్ ట్రాక్ ఏంటనేది సినిమాలో హైలైట్ ఎలిమెంట్ గా చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. రామ్ నటుడిగా ది బెస్ట్ ఇచ్చాడు. నవంబర్‌లో రావడంతోనే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయిందని టీమ్ చెప్పడం గమనార్హం.
మొత్తంగా, `ఆంధ్ర కింగ్ తాలూకా` చిత్రం రామ్ పోతినేని కెరీర్‌కు మరో దెబ్బగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ అంచనాలను అందుకోలేక, బాక్సాఫీసు వద్ద నిలబడలేక ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది.


