|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇది ఓ అభిమాని బయోపిక్.. అదిరిపోయిన ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్.. హీరో వీరాభిమాని పాత్రలో రామ్ పోతినేని

Published: 18-11-2025, 7:50 PM
ఇది ఓ అభిమాని బయోపిక్.. అదిరిపోయిన ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్.. హీరో వీరాభిమాని పాత్రలో రామ్ పోతినేని

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఓ వీరాభిమాని బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ పోతినేని పాత్రకు మంచి అంచనాలు ఉన్నాయి.

Key Points

1

నవంబర్ 18న రామ్ పోతినేని నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ ట్రైలర్ రిలీజ్.

2

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించారు.

4

నవంబర్ 27న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ విశేషాలు

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ట్రైలర్ మంగళవారం (నవంబర్ 18) రిలీజైంది. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ వచ్చేసింది. ఓ అభిమాని బయోపిక్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి హీరో అభిమాని తన సినిమా అని చెప్పుకునే విధంగా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అభిమాని కోసం కదిలి వచ్చే హీరో కథ ఇది.

రామ్ పోతినేని వీరాభిమాని పాత్ర

ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్

ఏంటి సాగర్.. ప్రింట్ రాకపోతే అద్దాలు పగలగొడతావ్.. కాలేజీలో గొడవలు పడతావ్.. టికెట్లు దొరక్కపోతే పరువుపోద్ది అంటావ్ అంటూ మూవీలో ఫిమేల్ లో లీడ్ రామ్ పాత్రతో మాట్లాడే మాటలతో ఈ ట్రైలర్ మొదలైంది. ఓ మాస్ అభిమానిలో ఉండాల్సిన అన్ని లక్షణాలతో సాగర్ పాత్రలో రామ్ పోతినేని ఒదిగిపోయాడు. అయితే హీరో కోసం ఏదైనా చేసే అభిమానులకు కొదవ లేదు. కానీ కష్టాల్లో ఉన్న తన అభిమాని కోసం ఓ హీరోనే కదిలి వస్తే.. ఆ సూర్య ఈ సాగర్ తో కలిస్తే అనే భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందింది.

సినిమా విడుదల తేదీ, అంచనాలు

ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ గురించి..

ఎ బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అనే క్యాప్షన్ తోనే అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నటించడంతోపాటు ఓ పాట రాసి పాడాడు రామ్ పోతినేని. ఇక భాగ్యశ్రీ , ఉపేంద్ర కీలకపాత్రలు పోషించారు. మూవీ ట్రైలర్ ఆంధ్రా కింగ్ తాలూకాపై అంచనాలు పెంచేసింది. చాలా రోజులుగా సక్సెస్ కోసం చూస్తున్న రామ్ పోతినేని ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. రామ్ పోతినేని తన పాత్రలో ఒదిగిపోయాడని స్పష్టమైంది. ఈ సినిమాతో రామ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.