
📌 Key Points
- విజయనగరం జిల్లాకు చెందిన సాయిశ్రీ హరికృష్ణ అమెరికాలో మృతి
- బర్త్ డే వేడుకల తర్వాత నదిలో ఈతకు వెళ్లిన హరికృష్ణ ప్రమాదవశాత్తు మరణించారు
- చిన్న వయసులోనే హరికృష్ణ మరణించడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు
- మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది
విజయనగరం జిల్లాకు చెందిన యువ ఇంజనీర్ సాయిశ్రీ హరికృష్ణ అమెరికాలో మరణించారు. బర్త్ డే సెలబ్రేషన్స్ తర్వాత నదిలో ఈతకు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు.
అమెరికాలో ఆంధ్ర యువకుడి దుర్మరణం
విజయనగరం జిల్లాకు చెందిన ఇంజినీర్ అమెరికాలో మృతి మరణించారు. బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాయిశ్రీ హరికృష్ణ నిన్న సాయంత్రం మరణించారు. MSC పూర్తిచేసి జనవరిలో ఎలిసెంట్ క్లీన్ టెక్నాలజీలో హరికృష్ణ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. కాగా.. నిన్న బర్త్ డే సెలబ్రేషన్స్ తర్వాత స్థానికంగా ఉన్న ఒక నదిలో ఈతకు వెళ్లి నదిలో మునిగి మరణించినట్లు ఆయన తండ్రి తెలిపారు. చిన్నవయసులోనే హరికృష్ణ మరణించడంపై రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తుందని తెలిపారు. కాగా.. హరికృష్ణ మరణవార్త అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని గొప్పగా చెప్పుకుని మురిసిపోయిన తల్లిదండ్రులు.. ఇప్పుడు తీరని కడుపుశోకంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి
కుటుంబంలో తీరని విషాదం
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


