|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ న్యూస్! మీ ఫోన్ హ్యాక్ అయితే.. క్షణాల్లో ఖాళీ అవుతుంది మీ బ్యాంకు ఖాతా!

Published: 10-03-2026, 11:05 AM
  • ఆండ్రాయిడ్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక.
  • హ్యాకర్లు మీ పరికరంలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు.
  • వెంటనే మీ ఆండ్రాయిడ్ పరికరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచన.
  • భారత ప్రభుత్వానికి చెందిన CERT-In ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. మీ ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ హెచ్చరికకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యాకింగ్ ప్రమాదం: కేంద్రం హెచ్చరిక!

Android Users Alert : ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌ డివైజ్‌లకు హ్యాకింగ్ రిస్క్ ఉందంటూ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. వెంటనే డివైజ్‌లను ఇప్పుడే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Android Users Alert : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు మీ డివైజ్ ఏ క్షణమైనా హ్యాక్ చేయొచ్చు. మీరు వాడే డివైజ్ స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ వాచ్, టాబ్లెట్ హ్యాకింగ్ రిస్క్ ఉందని తెలుసా? అవును.. మీరు చదివింది నిజమే..

అందుకే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికి కేంద ప్రభుత్వ ఒక హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) ఒక క్రిటికల్ వార్నింగ్ ఇష్యూ చేసింది. ఆండ్రాయిడ్ డివైజ్ లు హ్యాకింగ్ రిస్క్ పొంచి ఉందని చాలా సాంకేతిక లోపాలు ఉన్నాయని హెచ్చరించింది.

ప్రధానంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బగ్ ఉందని గుర్తించారు. ఈ లోపం ఆధారంగా హ్యాకర్లు మీ ఆండ్రాయిడ్ డివైజ్ ల్లోకి ఆర్బిటరీ కోడ్‌ను రన్ చేసేందుకు ప్రయత్నించే ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

మీ పరికరానికి హ్యాకింగ్ ముప్పు ఉందా?

ఈ ఎఫెక్ట్ అయిన డివైజ్ ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని బయటకు ఎక్స్ పోజ్ అయ్యేలా ఈ బగ్ హ్యాకర్లకు ఉపయోగపడుతుందని అధికారిక పేజీలో తెలిపింది. ఇంతకీ ఆండ్రాయిడ్ ఏ వెర్షన్ ఎక్కువగా హై హ్యాకింగ్ రిస్క్ లో ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..

Read Also : Income Tax Rules : ఇన్‌కమ్ టాక్స్ రూల్స్.. భర్త డబ్బులను భార్య SIPలో ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే రాబడిపై టాక్స్ ఎవరు కట్టాలి? ITRలో చూపించాలా?

ఒక హ్యాకర్ ఆండ్రాయిడ్ పరికరం యొక్క దుర్బలత్వాన్ని ఉపయోగించుకోవడంలో విజయవంతమైతే, వారు రిమోట్ కోడ్ అమలును అమలు చేస్తారు, ఆ తర్వాత పరికరం పూర్తిగా రాజీపడుతుంది.

హ్యాకింగ్ నుండి ఎలా కాపాడుకోవాలి?

హ్యాకర్ మీ డివైజ్ నుంచి వ్యకిగత సమాచారాన్ని తస్కరించే ముప్పు ఉంది. మీ బ్యాంక్ వివరాలు వంటి కీలక సమాచారాన్ని పొంది స్కామర్లు వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బును కాజేస్తారు. స్కామర్లు డేంజరస్ OS వెర్షన్ ఆండ్రాయిడ్ డివైజ్ లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ చేస్తుంటారు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైజ్ లను వెంటనే అప్ డేట్ చేసుకోవడం మంచిది. లేదంటే స్కామర్ల బారిన పడక తప్పదు.

లోపాలను ఎలా గుర్తించాలి? : ఆండ్రాయిడ్ బగ్ ఐడీ, క్వాల్కమ్ రిఫరెన్స్ నంబర్, యునిసోక్ రిఫరెన్స్ నంబర్, మీడియాటెక్ రిఫరెన్స్ నంబర్, ఎన్విడియా రిఫరెన్స్ నంబర్‌లలో లోపాల కారణంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని నిపుణులు అనేక లోపాలను గుర్తించారు.

యూజర్లు ఎలా సేఫ్‌గా ఉండాలంటే? : ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైజ్‌లలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా సేఫ్‍గా ఉండొచ్చు. ఈలోగా గూగుల్ రిలీజ్ చేసే ప్యాచ్ నోట్‌లను చెక్ చేయవచ్చు. అదనంగా, ఆండ్రాయిడ్ వినియోగదారులు స్మార్ట్‌వాచ్‌లు, ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి వారి ఫోన్లలో ఆటో అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అన్ని సమస్యలు ఫిక్స్ అవుతాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫ్‌గా ఉన్నట్టే..

ఆండ్రాయిడ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. మీ డివైజ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.