
📌 Key Points
- విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌తో అనిల్ రావిపూడి సెన్సేషనల్ ఎంట్రీ!
- కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్! అఫీషియల్‌గా లీక్ చేసిన డైరెక్టర్!
- LIK ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి హింట్: త్వరలో కృతితో సెట్స్‌లో సందడి!
- ఈ కలయిక కోసం ఆడియన్స్ వెయిటింగ్! సినిమాపై భారీగా అంచనాలు!
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ అప్‌డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
అనిల్ రావిపూడి మల్టీస్టారర్ అప్‌డేట్స్
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండిస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. దీంతో ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ఇప్పుడు మల్టీ స్టారర్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మేరకు విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైన్మెంట్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఈ కలయికలో సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా ఇందులో నటించే హీరోయిన్స్‌పై ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో భాగంగానే కళ్యాణ్ రామ్ సరసన యంగ్ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. తాజాగా LIK ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ డైరెక్టర్ కృతీ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘త్వరలో మనం సెట్‌లో కలుద్దాం. ఎలాగో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వా్ల్సిన అవసరం లేదు. ఇప్పటికే మనవాళ్లు రాసేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే అనిల్ ప్రాజెక్టులో కృతి భాగం అయినట్లు చెప్పకనే చెప్పేశాడు మన డైరెక్టర్.
కృతి శెట్టి హీరోయిన్‌గా ఖరారు?
డైరెక్టర్ క్లారిటీతో ఫ్యాన్స్ హ్యాపీ
అనిల్ రావిపూడి సినిమా గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి ఎలా సందడి చేస్తారో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


