|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: చిరంజీవి తాత పాత్రలు చేయాలనే వాళ్ళకి అనిల్ రావిపూడి అదిరిపోయే కౌంటర్!

Published: 22-01-2026, 10:35 PM
షాకింగ్ న్యూస్: చిరంజీవి తాత పాత్రలు చేయాలనే వాళ్ళకి అనిల్ రావిపూడి అదిరిపోయే కౌంటర్!
  • మన శంకర వరప్రసాద్ గారు చిత్రం: 300 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న మెగాస్టార్ మూవీ!
  • వింటేజ్ చిరంజీవిని చూసి ఫిదా అవుతున్న ప్రేక్షకులు, థియేటర్లకు క్యూ కడుతున్న అభిమానులు!
  • చిరంజీవి వయసు పై ట్రోల్స్ చేసేవారికి అనిల్ రావిపూడి స్ట్రాంగ్ కౌంటర్!
  • మోహన్ లాల్, రజినీకాంత్ తో చిరంజీవిని పోల్చడంపై రావిపూడి ఫైర్!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక సంచలన వార్త! ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో, చిరంజీవి గారిపై వస్తున్న ట్రోల్స్‌కు అనిల్ రావిపూడి గట్టిగా సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

300 కోట్ల క్లబ్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో తన సత్తా చాటారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల వరకు వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి చెప్పినట్లుగానే వింటేజ్ చిరంజీవిని ఈ చిత్రంలో ప్రెజెంట్ చేయడంతో ఆడియన్స్ తండోపతండాలుగా థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇప్పటికీ ఈ చిత్ర వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి.

రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. రిలీజ్ తర్వాత కూడా అనిల్ రావిపూడి ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ ఏజ్ లో చిరంజీవి అంత ఉత్సాహంగా డ్యాన్సులు, ఎనెర్జిటిక్ గా ఫైట్స్ చేస్తుండడంతో ప్రశంసలు దక్కుతున్నాయి. మరి కొందరు మాత్రం చిరంజీవి ఏజ్ కి తగ్గ పాత్రాలు చేయడం లేదని ట్రోల్ చేస్తున్నారు.

చిరంజీవి ఎనర్జీపై ట్రోల్స్.. రావిపూడి రియాక్షన్!

అని రావిపూడి తాజా ఇంటర్వ్యూలో చిరంజీవిని ట్రోల్ చేసే వారికి ఇచ్చి పడేశారు. అనిల్ రావిపూడి ట్రోలర్స్ కి ఇచ్చిన కౌంటర్ అలాంటి ఇలాంటి కౌంటర్ ఇవ్వలేదు. అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. చిరంజీవి ఇంకా ఇలాంటి పాత్రలు చేయడం అవసరమా ? మోహన్ లాల్, రజినీకాంత్, అమితాబ్ లాంటి సీనియర్లు ఎలాంటి పాత్రలు చేస్తున్నారో చూడండి. వాళ్ళలా చిరంజీవి ఎందుకు చేయడం లేదు అని కొందరు ప్రశ్నిస్తున్నట్లు యాంకర్ అనిల్ రావిపూడిని అడిగారు.

దీనికి అనిల్ రావిపూడి బదులిస్తూ.. ఒక వ్యక్తిని డీగ్రేడ్ చేయడానికి, కావాలని తగ్గించడానికి కొందరు వ్యక్తులు ఇలా మాట్లాడుతుంటారు. ప్రతి నటుడికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. రజినీకాంత్ గురించి మాట్లాడుతున్నారు కదా.. ఆయన సినిమాలని హై స్పీడ్ వాకింగ్ స్టైల్ లేకుండా ఊహించుకోగలమా ? అది రజినీకాంత్ స్టైల్, స్ట్రెంత్. రజనీకాంత్ గారికి తగ్గ సీన్లు ఆయన సినిమాలో ఉండాలి. అదే విధంగా చిరంజీవి గారికి తగ్గ సీన్లు ఆయన సినిమాల్లో ఉండాలి.

మోహన్ లాల్, రజినీకాంత్ తో పోలికలపై రావిపూడి ఫైర్!

కాకపోతే ఆ సన్నివేశాలు నమ్మదగినవిగా ఉండాలి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నయనతార తో లవ్ సీన్స్ చాలా క్యూట్ గా, నమ్మదగినవిగానే ఉన్నాయి కదా అని అనిల్ రావిపూడి తెలిపారు. మరో విషయం ఏంటంటే ఇంకా చిరంజీవి గారు అద్భుతమైన లుక్స్ మైంటైన్ చేస్తున్నారు. హుక్ స్టెప్ సాంగ్ కి డ్యాన్స్ చేసి ఆయన ఎలాంటి అలసట లేకుండా అలా వెళ్లిపోయారు. ఆయన అంత ఎనెర్జిటిక్ గా ఫిట్ గా ఉన్నప్పుడు.. తాత పాత్రలే చేయాలి, తండ్రి పాత్రలే చేయాలి అని మనం ఎందుకు రుద్దాలి అని అనిల్ రావిపూడి కౌంటర్ ఇచ్చారు.

చిరంజీవి గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మెగాస్టార్ అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.